cluster bean Pakodi By , 2016-11-26 cluster bean Pakodi cluster bean Pakodi recipe Prep Time: 10min Cook time: 30min Ingredients: పావుకేజి గోరు చిక్కుడు కాయలు,శనగపిండి రెండు టీస్పూన్లు(ఉంటే కాస్త కార్న్ ఫ్లోర్ కూడా కలుపుకోవచ్చు),రెండు ఉల్లిపాయలు(మీడియం సైజువి),,అరటీ స్పూన్ వాము,నాలుగు రెబ్బలు కరివేపాకు ,ఒక టీస్పూన్ అల్లం తరుగు,తగినతం ఉప్పు,వేయించడానికి కావాల్సినంత నూనె,అరటీస్పూన్ కారం, Instructions: Step 1 గోరుచిక్కుడు కాయల తొడిమెలు, ఈనెలు తీసి శుభ్రంగా కడిగి అంగుళం సైజులో తరగాలి. Step 2 ముక్కల్ని తగినంత నీటిలో చిటికెడు ఉప్పేసి 3 నిమిషాల పాటు ఉడికించి (నీరు) వార్చేయాలి. Step 3 ఉల్లిపాయల్ని నిలువుగా సన్నగా తరిగి, తర్వాత ఒక పాత్రలో ఉడికించిన గోరుచిక్కుడు ను తీసుకోవాలి. Step 4 దానికి ఉల్లితరుగు, కరివేపాకు, కారం, వాము, అల్లం తరుగు, ఉప్పు, శనగపిండి వేసి అవసరమైతే నీరు కలుపుతూ ముద్దలా చేసుకుని నూనెలో పకోడీల్లా వేసి దోరగా వేగించాలి. Step 5 కరకరలాడే టేస్టీ గోరుచిక్కుడు పకోడీ రెడీ, సాస్ తో తింటే కమ్మగా ఉంటాయి.
Yummy Food Recipes
Add