Potato gravy is a very simple and quick recipe By , 2016-10-27 Potato gravy is a very simple and quick recipe Special Potato Gravy Recipe Prep Time: 10min Cook time: 30min Ingredients: బేబీ పొటాటోలు - 10,పెరుగు - 1 కప్పు,పసుపు - 1 టేబుల్ స్పూన్,కారం - 2 టేబుల్ స్పూన్,ధనియాలపొడి - 2 టేబుల్ స్పూన్,గరం మసాల - 2 టేబుల్ స్పూన్,బట్టర్ - 2 టేబుల్ స్పూన్,జీలకర్రపొడి - 1 టేబుల్ స్పూన్,పెరుగు - 1 కప్పు,ఉప్పు: రుచికి సరిపడా,నూనె: తగినంత, Instructions: ముందుగా ప్రెజర్ కుక్కర్లో కొద్దిగా నీళ్ళు పోసి అందులో శుభ్రం చేసిన బేబీ పొటాటోలను వేయాలి. రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. తర్వాత గ్రేవీ తయారుచేసుకోవడానికి పాన్ తీసుకొని అందులో కొద్దినూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, పసుపు, గరం మసాలా, ధనియాలపొడి, బట్టర్ మరియు పెరుగు వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. 5 నిముషాలు వేగించుకొన్న తర్వాత ప్రెజర్ కుక్కర్ లోని నీరు వంపేసి, బేబీ పొటాటోల మీద తొక్కను తొలగించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో తొక్క తీసేసిన బేబీ పొటాటోలను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పొటాటోలు అన్ని వైపులా వేగిన తర్వాత వాటిని తీసి ఉడుకుతున్న గ్రేవీలో వేసుకోవాలి. అందులో మసాలా వేసి మొత్తం మిశ్రమాన్ని ఫ్రై చేసుకోవాలి. చివరగా అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసి ఉడికించాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.
Yummy Food Recipes
Add