Stuffed Capsicum Recipe By , 2017-11-06 Stuffed Capsicum Recipe Here is the process for Stuffed Capsicum Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: కాప్సికం - 5,బంగాలదుంపలు - 4,ఉల్లిపాయ - 2,టమాటా - 2,అల్లం వెల్లుల్లి పేస్టు - 1 చెంచా,పోపు దినుసులు - కొద్దిగా,గరం మసాలా పొడి - 1/4 చెంచా,ఉప్పు, కారం - తగినంత,కొత్తిమీర - 1 కట్ట,కసూరి మెంతి - 1 చెంచా, Instructions: Step 1 కాప్సికం కడిగి దాని తొడిమతో పాటు పై భాగాన్ని కొంత వరకు కట్ చెయ్యాలి.  Step 2 లోపల ఉన్న విత్తనాల్ని చాకుతో మెల్లిగా తీసెయ్యాలి.  Step 3 ఆ కాప్సికంలని నూనే వేసిన కడాయిలో వేసి ఉప్పు చల్లి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాలు చాలు అవి మగ్గటానికి. వాటిని తీసి వేరే ప్లేట్ లో ఉంచాలి.  Step 4 ఇప్పుడు అదే కడాయిలో నూనే వేసి పోపు దినుసులు వేసి చిటపటలాడాకా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు వెయ్యాలి.    Step 5 ఒక 2 నిమిషాల తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మగ్గనివ్వాలి. అందులో ఉడికించిన బంగాళదుంపలు వేసుకోవాలి.    Step 6 అంతా బాగా కలిపి అందులో ఉప్పు, కారం, గరం మసాలా పొడి, కసూరి మెంతి,కొత్తిమీర వేసి కలపాలి.   Step 7 కూర రెడీ అయిన తర్వాత ముందుగా మగ్గించుకున్న కాప్సికంలో ఈ కూరని స్టఫ్ చేయాలి.   Step 8 అప్పుడు కాప్సికం మాడిపోకుండా, పచ్చిగా లేకుండా చూడటానికి ఎంతో బాగుంటుంది. అంతే టేస్టీ టేస్టీగా ఉండే స్టఫడ్ కాప్సికం కర్రీ రెడీ అయినట్టే.          
Yummy Food Recipes
Add
Recipe of the Day