methi paneer rice|healthy paneer rice By , 2016-05-25 methi paneer rice|healthy paneer rice Here is a recipe of Methi Paneer Rice which you can make for lunch. This Methi Paneer Rice is very nutritious meal with the goodness of methi leaves. more details www.telugufoodrecipes. Prep Time: 15min Cook time: 30min Ingredients: రెండు కట్టలు ( 150 gms) మెంతిఆకులు,ఒక కప్పు  పన్నీర్,రెండు  ఉల్లిపాయలు,అర స్పూన్ వెల్లుల్లి పేస్టూ,రెండు పచ్చిమిర్చి,ఒక్కటి నిమ్మకాయ,ఒక కప్పు బియ్యం,రుచికి సరిపడా ‌ ఉప్పు,అర కప్పు‌  గరంమసాలా,రెండు‌  టమాటా,తగినంత‌ నూనె, Instructions: Step 1 తాజా మెంతి ఆకులను తీసుకొని శుబ్రంగా కడిగి చిన్నచిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి. పన్నీర్, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చిలను తిసుకొని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొవాలి.. Step 2 ఇప్పుడు ఒక పాత్ర తీసుకోని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేస్తూ పన్నీర్ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాత్రలోనే కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ మరియు వెల్లుల్లి పేస్టూ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిస్తూ ముందుగా తరిగి పెట్టుకున్న మెంతి ఆకు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలను వేసి రెండునిమిషాలు వేగనీవ్వాలి. Step 3 తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యం, సిరిపడా నీళ్లతో పాటు గరంమసాలా, నిమ్మరసం వేసి మొత్తం మిశ్రమాన్నీ అంతటిని బాగా కలిపి అన్నం వండుకోవాలి. Step 4 ఇప్పుడు అన్నం పూర్తిగా వండుకున్న తర్వాత స్టౌ మీద నుండి క్రిందకు దించుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను, కొద్దిగా నిమ్మరసం వేసి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి. అంతే మెంతి పన్నీర్ రైస్ రెడీ.. Step 5 ఈ మెంతి పన్నీర్ రైస్ ను మనకు నచ్చిన రైతాతో తింటె చాలా టేస్టీగా ఉంటుంది.
Yummy Food Recipes
Add