pesarapappu poornalu By , 2018-02-02 pesarapappu poornalu Here is the process for pesarapappu poornalu making .Just follow this simple tips Prep Time: 12hour 25min Cook time: 20min Ingredients: పెసరపప్పు : 2 కప్పులు,,బెల్లం : 2 కప్పులు.,కొబ్బరి : అర చెక్క (తురుము),,యాలుకులు : 4,,బియ్యం : 2 కప్పులు,మినప్పప్పు : ఒక కప్పు,,ఉప్పు : రుచికి,,నూనె : వేయించడానికి సరిపడా, Instructions: Step 1 పూర్ణాలు తయారు చేసుకోవడానికి ముందురోజు రాత్రి బియ్యం, మినప్పప్పు నాన పెట్టుకోవాలి.  Step 2 మరునాడు పూర్ణాలు తయారు చేసుకోవడానికి ఒక అరగంట ముందు బియ్యం, మినప్పప్పు దోసెల పిండిలాగా రుబ్బుకోవాలి.  Step 3 అలాగే పెసరపప్పును కూడా గంటసేపు నానబెట్టు కోవాలి. తర్వాత పప్పును ఇడ్లీ పిండిలా రుబ్బుకోవాలి.  Step 4 రుబ్బిన మిశ్రమాన్ని ఇడ్లీ లాగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లం పాకాన్ని ముదురు పాకంలాగా చిక్కగా తీసుకోవాలి.    Step 5 ఇప్పుడు ఇడ్లీలుగా వేసుకున్న ఆ కుడుములను మనం పొడి చేసుకుని అందులో యాలుకుల పొడి, కొబ్బరి, బెల్లం పాకాన్ని వేసి కలుపుకోవాలి.    Step 6 దానిని ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి.    Step 7 తరువాత మినప్పప్పు, బియ్యం పిండిలో కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.    Step 8 బాండిలో నూనె కాగిన తరువాత ఆ ఉండలను అ రుబ్బులో ముంచి నూనెలో వేయించుకుంటే పెసరపప్పు పూర్ణాలు తయారైనట్లే.    Step 9 కొంచెం వేడిగా ఉండగానే అందులో నెయ్యి వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి.      
Yummy Food Recipes
Add