rice rava pulihora recipe cooking tips weekend special food item By , 2015-01-02 rice rava pulihora recipe cooking tips weekend special food item rice rava pulihora recipe cooking tips weekend special food item : the cooking tips to make rice rava pulihora recipe. It is simple to make this recipe. Prep Time: 25min Cook time: 25min Ingredients: 2 కప్స్ బియ్యంరవ్వ, 2-3 నిమ్మకాయలు, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ వేరుశెనగ గింజలు, సరిపడా ఉప్పు, 6 టీ స్పూన్స్ నూనె, 1 టీ స్పూన్ పసుపు, 4 రెబ్బలు కరివేపాకు, 2-4 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ ఎండుమిర్చి, 2 టీ స్పూన్స్ శెనగపప్పు, 2 టీ స్పూన్స్ మినప్పప్పు, Instructions: Step 1 ముందుగా కుక్కర్ తీసుకుని అందులో బియ్యం రవ్వ, పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ నూనె వేసి కలుపుకోవాలి. అనంతరం ఇందులోనే ఒకటికి రెండుచొప్పున 4 కప్పుల నీళ్లు పోయాలి. Step 2 ఈ మొత్తం మిశ్రమంతో కూడిన కుక్కర్’ను స్టౌవ్ మీద పెట్టి కొద్దిసేపటివరకు మరగించాలి. 3 విజిల్స్ వచ్చేంతవరకు మరగించిన తర్వాత కుక్కర్’ని కిందకు దించేసి.. ఉడికిన రవ్వను పొడిపొడిగా చేసి చల్లార్చుకోవాలి. Step 3 ఇప్పుడు ఒక బాణలి తీసుకుని అందులో 5 టీ స్పూన్ల నూనె వేసి వేయించాలి. నూనె కాగిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఇంగువ, వేరుశెనగ గింజలు వేసి వేయించాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఆవాలు, ఎండుమిర్చి, శెనగపప్పు, మినప్పప్పులతో పోపు పెట్టాలి. ఆ పోపులోనే నిమ్మరసం, సరిపడా ఉప్పును కలుపుకోవాలి. Step 4 ఈ మొత్తం మిశ్రమాన్ని ఇదివరకు ఉడికించిన రవ్వలో వేసి బాగా కలియబెట్టుకోవాలి. అనంతరం పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే! నిమ్మకాయ సువాసనలతో కూడిన రవ్వ పులిహోర రెడీ!
Yummy Food Recipes
Add