Kobbari Garijalu By , 2018-06-23 Kobbari Garijalu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Kobbari Garijalu making in best way. Prep Time: 15min Cook time: 25min Ingredients: మైదా 500 గ్రా.లు,ఎండు కొబ్బరి పొడి 1 కప్పు,చక్కెర 1 కప్పు,బొంబాయి రవ్వ 1/2 కప్పు,పుట్నాల పొడి 1/2 కప్పు,పల్లీలు 1/2 కప్పు,కాజు, కిస్మిస్ 1/4 కప్పు,నెయ్యి 1 టీస్పూన్,నూనె వేయించడానికి తగినంత, Instructions: Step 1 కడాయిలో రెండు చెంచాల నెయ్యి వేడి చేసి బొంబాయి రవ్వని దోరగా వేయించాలి. దీని వల్ల బొంబాయి రవ్వ పచ్చివాసన పోతుంది. అలాగే మంచి నెయ్యి వాసన వస్తుంది Step 2 మిగిలిన నెయ్యి కూడా వేడి చేసి చిన్న ముక్కలుగా చేసుకున్న కాజు, కిస్మిస్ పలుకులు వేసి దోరగా వేయించి రవ్వలో వేయాలి. Step 3 పల్లీలు కూడా వేయించి పొట్టు తీసి ఇందులో వేయాలి.పుట్నాలపప్పు పొడి, ఇలాచి పొడి, చక్కెర వేసి బాగా కలపాలి. Step 4 మైదాపిండి జల్లించి చిటికెడు ఉప్పు, చెంచాడు నెయ్యి లేదా వెన్న వేసి తగినన్ని నీళ్ళు కలుపుకుంటూ రొట్టెలపిండిలా తడిపి బట్ట కప్పి లేదా మూత పెట్టి ఉంచాలి. Step 5 గంట తర్వాత తీసి బాగా పిసికి చిన్న నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి. ఒక్కో ఉండ తీసుకుని పూరీలా వత్తుకోవాలి. Step 6 అంచులకు తడి అచాలి.మధ్యలో పెద్ద చెంచాడు రవ్వపొడి పెట్టి సగం మడిచి అంచులు విడిపోకుండా గట్టిగా వత్తాలి. Step 7 ఇలా అన్నీ చేసుకుని వేడి నూనెలో రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకూ కాల్చుకోవాలి. 
Yummy Food Recipes
Add