బీట్’రూట్’లో విటమిన్ సి, పొటాషియం ఫోలిక్ యాసిడ్’లు పుష్కలంగా వుంటాయి. అంతేకాదు.. రక్తాన్ని శుభ్రపరిచే లక్షణాన్ని కలిగి వుండటంతోబాటు క్యాన్సర్ కారక కణాలను వృద్ధి కాకుండా నిరోధిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను నిరోధించడంలోనూ ప్రత్యేక పాత్రను పోషిస్తుంది. ఇన్ని ఆరోగ్య లక్షణాలతో కూడిన ఈ బీట్’రూట్’ని ఆహార వంటకాల్లో కలిపి తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం.
ఒకవేళ ఆహార వంటకాల్లో కాకపోయిన.. సలాడ్ రూపంలోను దీనిని తీసుకోవచ్చు. ఇక ఈ సలాడ్’లో పోషక విలువలు కలిగిన ఇతర పదార్థాలనూ జోడించడంతో మరిన్ని ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. మరి.. ఆ బీట్’రూట్ సలాడ్’ను ఎలా చేస్తారో తెలుసుకుందామా...