Spinach Rice By , 2018-05-19 Spinach Rice Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Spinach Rice making in best way. Prep Time: 20min Cook time: 35min Ingredients: బియ్యం 400 గ్రాములు,పచ్చి బఠానీలు 200 గ్రాములు,బచ్చలికూర 4 కట్టలు,సాంబారు ఉల్లిపాయలు 16,పచ్చిమిరపకాయలు 6,ఎండుమిరపకాయలు 16,చిరంజి ఆకులు 2,లవంగాలు 4,టమోటాలు 6,నెయ్యి కొద్దిగా,పచ్చికొబ్బరి తురుము: 4 టేబుల్ స్పూనులు,జీడిపప్పు ముక్కలు 4 టేబుల్ స్పూనులు,ధనియాలు 4 టీ స్పూనులు,దాల్చినచెక్క 2 ముక్కలు తగినంత,నూనె తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా పచ్చిబఠానీలను వేడినీటిలో మెత్తగా ఉడికించి, నీళ్ళను వార్చి, పక్కన పెట్టుకోవాలి. తరువాత పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడిగి నిలువుగా ముక్కలుగా తరగాలి. Step 2 సాంబారు ఉల్లిపాయల పొట్టు తొలగించి పక్కన పెట్టుకోవాలి. టమోటాలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరగాలి. బచ్చలికూరను శుభ్రంగా కడిగి, సన్నగా తరిగి పెట్టుకోవాలి. జీడిపప్పును నేతిలో వేయించి పక్కన వుంచుకోవాలి. Step 3 తరువాత బియ్యంను శుభ్రంగా కడిగి, అన్నం వండాలి. తరువాత ఈ అన్నంను ఒక వెడల్పుగా వున్న పళ్లెంలో వేసి మెతుకులు పొడిపొడిగా వుండేలా ఆరబెట్టాలి. Step 4 తరువాత ఒక బాణలిలో కొంచెం నూనె పోసి స్టౌ మీద వేడి చేయాలి తరువాత ఇందులో సన్నగా తరిగిన బచ్చలి కూరను వేసి, నీళ్ళు చల్లి, ఆకులో తడిపోయేంతవరకు సన్నని సెగమీద వేయించాలి.   Step 5 తరువాత బాణాలిని కిందకు దించుకోవాలి. తరువాత ఒక కళాయిలో కొద్దిగా నూనె పోసి ధనియాలు, ఎండు మిరపకాయలను వేసి వేయించాలి. తరవాత కళాయిని కిందికి దించుకోవాలి.   Step 6 తర్వాత వేయించిన ధనియాలు, కొబ్బరితురుమును కొంచెం నీళ్లు కలిపి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి  తర్వాత ఓ బాణలిలో తగినంత నూనె పోసి, ముందుగా పచ్చిమిరపకాయ ముక్కలు, పొట్టు తీసిన సాంబారు ఉల్లిపాయల్ని వేయించాలి.    Step 7 తర్వాత ఇందులో టమాట ముక్కల్ని, గ్రైండ్ చేసి సిద్ధంగా ఉంచుకున్న ధనియాలు, ఎండుమిర్చి, బచ్చలికూర, జీడిపప్పు ముక్కలు, కొబ్బరి తురుముల మిశ్రమాన్ని కలపాలి.   Step 8 తర్వాత ఒక కళాయిలో కొద్దిగా నూనెపోసి దాల్చిన చెక్క, లవంగాలు కలపాలి తర్వాత ఈ మిశ్రమాన్ని బాణాలిలో వేగుతున్న టమాట మిశ్రమంలో కలపాలి. ఈ మిశ్రమానికి తడి ఆరిపోయి, కమ్మటి వాసన వచ్చే వరకు వేయించాలి.   Step 9 తర్వాత బాణిలిలో ఆరబెట్టిన అన్నం, తగినంత ఉప్పులను వేసి బాగా కలియబెట్టి సన్నని సెగమీద అన్నం వేడెక్కెంత వరకు ఉంచి బాణాలిని కిందకు దించుకోవాలి. దీంతో ఘుమఘుమలాడే భవ్య బచ్చలి కూర అన్నం రెడీ.       
Yummy Food Recipes
Add
Recipe of the Day