Pulihora By , 2018-05-19 Pulihora Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Pulihora making in best way. Prep Time: 30min Cook time: 35min Ingredients: బియ్యం 500 గ్రాములు,చింతపండు 150 గ్రాములు,ఎండుమిరపకాయలు 6,ధనియాలు 2 టీ స్పూనులు,మెంతులు 1/2 టీ స్పూనులు,మిరియాలు 1 టీ స్పూను,జీడిపప్పు ముక్కలు 2 టేబుల్ స్పూనులు,కరివేపాకు 2 రెబ్బలు,ఇంగువపొడి చిటికెడు,పసుపు చిటికెడు,నువ్వుల నూనె తగినంత,ఉప్పు తగినంత, Instructions: Step 1 ముందుగా చింతపండులో నాలుగు కప్పుల నీళ్ళు పోసి నానబెట్టాలి.  Step 2 తరువాత మిరియాలను బరకగా దంచి పొడి చేసుకోవాలి. తరువాత బాణలిలో కొద్దిగా నూనె పోసి మెంతులు, ధనియాలను మిరియాలను వేసి వేయించాలి. Step 3 తరువాత బియ్యంను శుభ్రంగా కడిగి, కొంచెం బిరుసుగా అన్నంను పండుకోవాలి. Step 4 తరువాత దీనిని వెడల్పుగా వున్న పళ్ళెంలో వేసి మెతుకులు పొడిపొడిగా వుండేలా సర్ది చల్లారబెట్టాలి.   Step 5 తరువాత ఒక బాణలిలో కొంచెం నూనె పోసి ఎండుమిరపకాయ ముక్కల్ని, ఇంగువ పొడిని వేసి వేయించాలి.   Step 6 తరువాత ఇందులో చింతపండు గుజ్జు, పసుపులను వేసి, చిక్కబడేంతవరకు గరిటెతో కలుపుతూ ఉడికించాలి.    Step 7 తరువాత ఇందులో తయారు చేసి సిద్ధంగా వుంచుకున్న బరకగా మిరియాలపొడి, ఉప్పులను కలిపి, బాణాలిని మీద నుంచి కిందకు దించుకోవాలి..   Step 8 తరువాత పళ్ళెంలోని అన్నంలో బాణాలిలోని చింతపండు గుజ్జు మిశ్రమాన్ని మెంతులు, ధనియాలు, మిరియాలపొడిని వేసి బాగా కలియబెట్టాలి.   Step 9 తరువాత ఒక కళాయిలో కొంచెం నువ్వుల నూనె పోసి, కరివేపాకు, జీడిపప్పు ముక్కలను వేయించి, పళ్ళెంలోని అన్నం మిశ్రమంపై చల్లుకోవాలి దీనితో ఇంటిల్లిపాదినీ నోరూరించే పులిహోర రెడీ. దీనిని చల్లబడిన తరువాత భుజిస్తే చాలా బాగుంటుంది.      
Yummy Food Recipes
Add