butterscotch cake By , 2018-05-16 butterscotch cake Here is the process for butterscotch cake making .Just follow this simple tips Prep Time: 30min Cook time: 1hour Ingredients: మైదాపిండి-100గ్రా,,వెన్న-100గ్రా,,పంచదార పొడి-100గ్రా,,బేకింగ్‌ పౌడర్‌-ఒక టీ స్పూన్‌,,వంట సోడా-అర టీ స్పూన్‌,,పాలపొడి-రెండు టేబుల్‌ స్పూన్లు,,బటర్‌స్కాచ్‌ ఎసెన్స్‌-ఒక టీ స్పూన్‌,,లెమన్‌ ఎల్లో ఫుడ్‌ కలర్‌-తగినంత.,,ఐసింగ్‌ కోసం : ,వెన్న-100గ్రా,,ఐసింగ్‌ షుగర్‌-200గ్రా,,లెమన్‌ ఎల్లో కలర్‌-కొన్ని చుక్కలు,,బటర్‌స్కాచ్‌ కాండీస్‌-అర కప్పు,,వేడినీరు-కొద్దిగా., Instructions: Step 1 ఒక పాత్రలో కొంత మైదాపిండి, బేకింగ్‌ పౌడర్‌, వంట సోడా, పాలపొడి, వెన్న, పంచదార వేసి కలపాలి.  Step 2 తరువాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి గిలకొట్టాలి.  Step 3 దీనికి బటర్‌స్కాచ్‌ ఎసెన్స్‌, లెమన్‌ ఎల్లో ఫుడ్‌ కలర్‌ చేర్చి మళ్లీ ఒకసారి మిక్సీలో గిలకొట్టాలి. Step 4 మరీ పలచగా అనిపిస్తే మైదాపిండిని కొద్దికొద్దిగా చేర్చుతూ మళ్లీ మిక్సీలో గిలకొట్టాలి.    Step 5 తరువాత ఎలకి్ట్రక్‌ ఓవెన్‌లోని గిన్నెలో కొద్దిగా డాల్డా రాసి, ఈ మిశ్రమాన్ని ఆ గిన్నెలో పోసి 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద 40-50 నిమిషాలు బేక్‌ చేయాలి. బేకింగ్‌ పూర్తయి చల్లారాక కేక్‌పైన ఐసింగ్‌ చేయాలి.    ఐసింగ్‌ ఇలా :  Step 6 వెన్న, ఐసింగ్‌ షుగర్‌లను ఒక పాత్రలో వేసి నురుగు వచ్చేంత వరకు గిలకొట్టాలి.    Step 7 దీనికి ఎసెన్స్‌, ఫుడ్‌ కలర్‌, కొద్దిగా వేడినీరు చేర్చి మళ్లీ గిలకొట్టాలి.    Step 8 ఈ మిశ్రమాన్ని కేక్‌పైన పల్చగా పోసి బటర్‌ నైఫ్‌ సహాయంతో కేక్‌ అంతటా సమంగా సర్దాలి. ఆపైన బటర్‌స్కాచ్‌ క్యాండీస్‌తో అలంకరించాలి. (నాన్‌వెజ్‌ను ఇష్టపడేవారు గుడ్డును కూడా బటర్‌స్కాచ్‌ కేక్‌లో కలుపుకోవచ్చు)          
Yummy Food Recipes
Add