badam cherry cake By , 2018-05-16 badam cherry cake Here is the process for badam cherry cake making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 1hour Ingredients: గట్టి పాలు: ముప్పావు లీటరు,,మైదాపిండి: అరకిలో,,చక్కెర పొడి: 150 గ్రాములు,,బాదంపప్పు: 150 గ్రాములు,,ఎండు చెర్రీలు:150 గ్రాములు(ముక్కలుగా చేసుకోవాలి),,బేకింగ్‌ పౌడర్‌: నాలుగు టేబుల్‌ స్పూన్లు,,వంటసోడా: ఒకటిన్నర స్పూను,,వెన్న: పావుకిలో,,వేడిపాలు: నాలుగు కప్పులు,,ఆల్‌మండ్‌ ఎసెన్స్‌: టేబుల్‌ స్పూను., Instructions: Step 1 బాదంపప్పులను కొద్దిసేపు వేడినీటిలో వేసి పైన తొక్క తీసి ముక్కలుగా చేసుకోవాలి.  Step 2 మైదా, బేకింగ్‌ పౌడర్‌, వంటసోడా ఒక గిన్నెలో వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.  Step 3 వెన్నలో చక్కెర పొడి వేసి మృదువుగా అయ్యే వరకూ గిలక్కొట్టువాలి.  Step 4 ఇందులోనే ఆల్మండ్‌ ఎసెన్స్‌ కూడా కలిపి వుంచుకోవాలి.    Step 5 గట్టిపాలను నెమ్మదిగా పోస్తూ వెన్నలో కలిసేటట్టు స్పూనుతో కలుపు కోవాలి.    Step 6 ఇప్పుడు ముక్కలుగా చేసి పెట్టుకున్న బాదం పప్పులను కూడా జతచేసుకోవాలి.    Step 7 ఈ మిశ్రమంలో ముందుగా కలిపిపెట్టుకున్న మైదాపిండిని కలుపు కుంటూ అవసరం అనుకుంటే వేడిపాలు కొద్ది కొద్దిగా పోసుకోవాలి.   Step 8 ఈ మిశ్రమాన్ని బేకింగ్‌ డిష్‌లోకి మార్చి ఓవెన్‌లో నలభై నిమిషాల పాటు బేకింగ్‌ చేసుకోవాలి. చల్లారిన తరువాత సర్వ్‌ చేసుకోవచ్చు.          
Yummy Food Recipes
Add