royyala pachadi By , 2018-05-01 royyala pachadi Here is the process for royyala pachadi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 40min Ingredients: రొయ్యలు : అర కిలో,వెల్లుల్లి పేస్ట్ : ఒక టేబుల్ స్పూన్,కారం : అరకప్పు,ఉప్పు : ఒక టేబుల్ స్పూన్,లవంగాల పొడి : అర చెంచ,నూనె : అరకిలో,నిమ్మకాయ : 1, Instructions: Step 1 రొయ్యలు వాసనా పోవాలంటే ముందుగా రెండు నిముషాలు వేడినీటిలో వేసి రెండు పొంగులు వచ్చాక తీసి ఒక బట్ట మీద వేసి కాసేపు ఆరనివ్వాలి.  Step 2 మూకుడులో నూనె(డీప్ ఫ్రైకి సరిపడా) వేడి చేసుకొని రొయ్యలను వేయించుకోవాలి.  Step 3 రొయ్యలు త్వరగా వేగిపోతాయి కనుక తొందరగా నూనెలో నుంచి చిల్లుల గరిటెతో ఒక గిన్నెలోకి తీసుకోవాలి.  Step 4 రొయ్యల పచ్చడిలో లవంగాల పొడి కాస్త ఎక్కువగా, కారం కాస్త తక్కువగా వేస్తే బాగుంటుంది.    Step 5 మూకుడులో ఒక కప్పు లేదా కప్పున్నర నూనె మాత్రం ఉంచి మిగిలిన నూనె తీసేయాలి.    Step 6 స్టవ్ తక్కువ మంట మీద పెట్టుకొని ఆ మూకుడు పెట్టి, అందులో నూరిన వెల్లుల్లి ముద్ద,లవంగాల పొడి, కారం, ఉప్పు వేసుకోవాలి.    Step 7 స్టవ్ ఆర్పీవెసి, గిన్నెలోకి తీసుకున్నరొయ్యలను వేసి బాగా కారం పట్టేలా కలపాలి. వేడి తగ్గిన తరువాత నిమ్మకాయరసం పిండాలి.           
Yummy Food Recipes
Add
Recipe of the Day