chicken-rolls By , 2018-04-08 chicken-rolls Here is the process for chicken-rolls making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 40min Ingredients: చపాతీలు: 4,ఉల్లిపాయలు: 1,క్యాప్సికమ్: 1,క్యారెట్ : 1,టమోటో: 1,నిమ్మకాయ: 1,మయోనైజ్: తగినంత,చికెన్ ఫిల్లింగ్ కోసం :,బోన్ లెస్ చికెన్: 150grm,ఉల్లిపాయ:1,పచ్చిమిర్చి: 3-4,అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp,ధనియాలపొడి: 1tsp,చికెన్ మసాలా పొడి: 1tsp,జీలకర్రపొడి: 1/2tsp,షాజీరా : చిటికెడు,కారం: 1tsp,ఉప్పు: రుచికి సరిపడా,కరివేపాకు, కొత్తిమీర, పుదీనా : 2tbsp సన్నగా తరిగి పెట్టుకోవాలి,నూనె: 2tbsp, Instructions: Step 1 ముందుగా పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో షాజీరా, పుదీనా, ఉల్లిపాయ, కరివేపాకు, వేసి ఒక నిముషం వేగించుకోవాలి.  Step 2 తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించుకోవాలి.  Step 3 ఇందులో ముందుగానే పసుపు, ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకొన్న బోన్ లెస్ చికెన్ ముక్కల్ని వేసి బాగా కలిపి మూతపెట్టి 10 నిముషాలు మగ్గించాలి.  Step 4 మగ్గిన చికెన్ లో ధనియాల పొడి, జీలకర్ర, చికెన్ మసాలా, కారం, ఉప్పు, వరుసగా వేస్తూ కలిపి మళ్ళీ మూతపెట్టి మరొక 10 నిముషాల వరకూ కర్రీని ఉడికించుకోవాలి. 5. కర్రీ దగ్గర పడుతున్నప్పుడు, మూత తీసి కలియబెడుతుండాలి. 5 నిముషాల తర్వాత వేయించితే చికెన్ స్టఫింగ్ రెడీ అయినట్లే..    Step 5 ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్ లను సన్నగా తరిగి, నిమ్మరసం పిండి సలాడ్ లాగా రెడీ చేసి పెట్టాలి.    Step 6 ఇప్పుడు ముందుగా తయారుచేసి పెట్టుకొన్న చపాతీల మీద మయోనైజ్ అప్లై చేయాలి.    Step 7 చపాతీ మొత్తం మయోజైజ్ అప్లై చేసిన తర్వాత చపాతీల మీద కూరగాయల ముక్కలు పెట్టాలి.   Step 8 వీటి మీద ముందుగా తయారుచేసుకొన్న చికెన్ స్టఫ్ పెట్టాలి. అలాగే చికెన్ స్టఫ్ మీద తిరిగి వెజిటేబుల్ ముక్కలు వేసి స్టఫ్ చేయాలి.    Step 9 చివరగా టమోటో సాస్ వేసి చపాతీని రోల్ చేస్తే సరి హోం మేడ్ చికెన్ రోల్ రెడీ...      
Yummy Food Recipes
Add
Recipe of the Day