Gongura Pulihora By , 2017-02-08 Gongura Pulihora Here is the process for Gongura Pulihora making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బియ్యం: 2 కప్పులు,గోంగూర: 5 కట్టలు,ఎండుమిర్చి: నాలుగు,,పచ్చిమిర్చి: ఆరు,,పసుపు: టీస్పూను,,ఉప్పు: రుచికి సరిపడా,,ఇంగువ: పావుటీస్పూను,,కరివేపాకు:ఒక రెమ్మ,సెనగపప్పు: టేబుల్‌స్పూను,,మినప్పప్పు: 2 టీస్పూన్లు,,ఆవాలు: అరటీస్పూను,,మెంతులు: పావుటీస్పూను,,జీడిపప్పు: 2 టేబుల్‌స్పూన్లు,పల్లీలు: 2 టేబుల్‌స్పూన్లు,,నూనె: 3 టేబుల్‌స్పూన్లు, Instructions: Step 1 గోంగూర ఆకుల్ని తుంచి శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి. Step 2 స్టవ్ వెలిగించి పాన్ పెట్టి టేబుల్‌స్పూను నూనె వేసి కాగాక తరిగిన గోంగూర వేసి బాగా వేయించాలి. చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. Step 3 బియ్యం కడిగి ఉడికించి చల్లారానివ్వాలి . Step 4 మరల స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి కాగాక జీడిపప్పు ఓ నిమిషం వేయించి తీయాలి. Step 5 తరవాత పచ్చిసెనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, ఇంగువ, మెంతులు, ఆవాలు, కరివేపాకు అన్నీ వేసి వేగాక సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసి దించాలి. Step 6 ఇప్పుడు చల్లారిన అన్నంలో గోంగూర ముద్ద , తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి . తరవాత తాలింపు వేసి బాగా కలుపుకోవాలి .. అంతే పుల్ల పుల్లని గొంగూర పులిహోర రెడీ .
Yummy Food Recipes
Add