carrot-ootappam By , 2018-03-24 carrot-ootappam Here is the process for carrot-ootappam making .Just follow this simple tips Prep Time: 8hour 15min Cook time: 20min Ingredients: బియ్యం.. ఒక కప్పు,మినప్పప్పు.. ఒక టి స్పూన్,మెంతులు.. ఒక టి స్పూన్,ఉప్పు.. తగినంత,వంటసోడా.. పావు టి స్పూన్,పచ్చిమిర్చి.. మూడు,ఉల్లిపాయ..ఒకటి,క్యారెట్ తురుము.. పావు కప్పు,టొమోటో.. ఒకటి,కొత్తిమీర.. సరిపడ, Instructions: Step 1 బియ్యం, మినప్పప్పు, మెంతులను కలిపి నీటిలో సుమారు 8 గంటలపాటు నానబెట్టుకోవాలి. Step 2 మరుసటి రోజు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా సుమారు 8 గంటలపాటు ఫ్రిజ్‌లో కాకుండా బయటే ఉంచాలి.  Step 3 పులిసిన పిండిలో ఉప్పువేసి బాగా కలియబెట్టాలి.  Step 4 ఊతప్పం వేయడానికి ముందు మాత్రమే సోడా వేసి కలపాలి.   Step 5 పెనం వేడిచేసి ఒక టీస్పూన్ నూనె వేసి పెనమంతా రుద్దాలి.   Step 6 ఇప్పుడు గరిటెతో పిండిని పోసి మందంగా వేయాలి.    Step 7 మరో టీస్పూన్ నూనెని ఊతప్పం చుట్టూ వేయాలి. ఇప్పుడు తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి, టొమోటో, క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర తరుగుల్ని వేయాలి.    Step 8 సిమ్‌లో 5 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తరువాత ఊతప్పంను ప్లేటులోకి మెల్లిగా తీయాలి.   Step 9 అంతే క్యారెట్ ఊతప్పం తయార్. ఇది  వేడిగా ఉన్నప్పుడే కొబ్బరి చట్నీ లేదా టొమోటో సాస్‌, సాంబార్‌లతో కలిపి తింటే రుచి అదిరిపోతుంది.   Step 10 ఆరోగ్యానికి మంచిది కూడా.   
Yummy Food Recipes
Add
Recipe of the Day