prawns-curry By , 2018-03-24 prawns-curry Here is the process for prawns-curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: తాజా పచ్చి రొయ్యలు.. అర కిలో,ఉల్లిపాయలు.. ఆరు,అల్లంవెల్లుల్లి పేస్ట్.. ఒక టీ.,టొమోటో పేస్ట్.. రెండు కప్పులు,మిల్క్ క్రీమ్.. ఒక కప్పు,కారం, నూనె.. సరిపడా,కసూరి మేథీ.. ఒక టీ.,పచ్చిమిర్చి.. 8,కొత్తిమీర.. ఒక కట్ట,వెల్లుల్లి.. 4 రెబ్బలు,అల్లం ముక్కలు.. కొద్దిగా,జీడిపప్పులు.. ఆరు,గరం మసాలా.. 2 టీ.,ఉప్పు.. సరిపడా, Instructions: Step 1 పచ్చి రొయ్యలను శుభ్రం చేసి వాటికి ఉప్పు, కారం కలిపి ఉంచాలి.  Step 2 బాణలిలో నూనె పోసి కాగాక అందులో రొయ్యల్ని వేసి దోరగా వేయించి తీయాలి. Step 3 అదే నూనెలో ఉల్లిపాయ ముద్దను వేసి కాసేపు వేయించాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించాలి. Step 4 తరువాత కారం, పచ్చిమిర్చి ముద్ద.. అల్లం, వెల్లుల్లి తరుగులను కూడా వేసి కలిపి వేయించాలి.    Step 5 చివరిగా టొమోటో పేస్ట్‌ను కలిపి వేసి, కలియబెట్టి ఉడికించాలి.    Step 6 కాసేపటి తర్వాత వేయించి ఉంచిన రొయ్యలను వేసి, ఉప్పు సరిజూసుకుని సన్నటి మంటపై ఉడికించాలి.    Step 7 తరువాత కసూరి మేథీ, గరంమసాలా, జీడిపప్పులను వేసి బాగా కలియబెట్టి మరికాసేపు ఉడికించాలి.    Step 8 చివరగా కూర కిందికి దించేముందు మిల్క్ క్రీమ్ కలపాలి. సర్వింగ్ చేసే ముందు కొత్తిమీర తురుము చల్లి వడ్డించాలి.    Step 9 అంతే ఘుమఘుమలాడే మలాయ్ ప్రాన్ కర్రీ సిద్ధం.       
Yummy Food Recipes
Add
Recipe of the Day