kaima-rolls By , 2018-03-24 kaima-rolls Here is the process for kaima-rolls making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: కైమా.. అర కేజీ,నూనె.. ఒకటిన్నర కప్పు,ఉల్లిపాయలు.. ఐదు,వెల్లుల్లి.. ఆరు,కోడిగుడ్డు.. ఒకటి,అల్లంముక్క.. కాస్తంత,వేయించిన శనగపప్పు.. 4 టీ.,లవంగాలు.. 3,దాల్చిన చెక్క.. 3,యాలకులు.. 2,ధనియాలు.. 2 టీ.,పసుపు, ఉప్పు, కారం.. తగినంత, Instructions: Step 1 కైమాను శుభ్రం చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లిని ముద్దగా నూరుకోవాలి. Step 2 ఉల్లిపాయలను సన్నగా తరిగి ఉంచాలి. శెనగపప్పును పొడి చేసి ఉంచాలి. Step 3 ఒక గిన్నె స్టవ్‌పై ఉంచి, అందులో కైమా, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలియబెట్టి నీళ్లు పోయకుండానే ఉడికించాలి. Step 4 కైమా బాగా ఉడికాక దించి, శెనగ పొడి వేయాలి.   Step 5 దాంట్లోనే కోడిగుడ్డు పగులగొట్టి బాగా కలిపి ఉంచి, మిశ్రమాన్ని కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలి.   Step 6 ఇప్పుడు బాగా కాగుతున్న నూనెలో కైమా ఉండలను వేసి ఎర్రగా వేయించి తీసేయాలి.   Step 7 అంతే వేడి వేడి రుచికరమైన కైమా ఉండలు సిద్దం.   Step 8 ఈ కైమా ఉండలను ఆపరేషన్ చేయించుకున్నవారికి బలం వచ్చేందుకు తినిపిస్తుంటారు.   Step 9 రుచిగా ఉండటమేగాకుండా, శరీరానికి బలాన్నిచ్చే ఈ కైమా ఉండలను ఇష్టపడనివారుండరంటే అతిశయోక్తి కాదు.    Step 10 మీరూ ఓసారి ట్రైచేసి చూడండి మరి..!!   
Yummy Food Recipes
Add