Bombai Ravva Upma By , 2018-02-19 Bombai Ravva Upma Here is the process for Bombai Ravva Upma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బొంబాయి రవ్వ : పావుకిలో,ఉల్లిపాయ : 1 పెద్దది తరుగుకోవాలి,పచ్చిమిర్చి : 2 కాయలు చిన్నముక్కలుగా తరుగుకోవాలి,అల్లం : చిన్న ముక్క తురుముకోవాలి,కరివేపాకు : కొద్దిగా,వేరుశెనగ గుళ్ళు : కొద్దిగా,నూనె : 2 టేబుల్ స్పూన్లు,ఉప్పు : తగినంత,కొత్తిమీర : కొద్దిగా,నీళ్ళు : రవ్వను గ్లాసుతో కొలచి అదే గ్లాసుతో 1 గ్లాసు రవ్వకు రెండున్నర గ్లాసులు నీళ్ళు పోయాలి. కొద్దిగా జావగా కావలనుకునేవారు 3,గ్లాసు నీళ్ళు పోయాలి.,పోపుగింజలు : 1 స్పూను,ఎండుమిర్చి : 2, Instructions: Step 1 ముందుగా పాన్ లేక వెడల్పాటి పాత్ర తీసుకొని నూనె లేక నెయ్యి వేసి వెడెక్కిన తరువాత ఎండుమిర్చి, పోపుగింజలు, వేరు శెనగగుండ్లు, అల్లం వేసి అవి వేగిన తరువాత నీరు పోయాలి. నీరు మరిగేటప్పుడు తగినంత ఉప్పు కలుపుకోవాలి.  Step 2 ఇప్పుడు బొంబాయి రవ్య(ఉప్మారవ్వ) ను నిదానంగా కొద్దికొద్దిగా పోస్తూ ఉండకట్టకుండా అట్లకాడతో త్రిప్పుతుండాలి. Step 3 చక్కగా ఉడికిన తరువాత దించుకొని కొత్తిమీర చల్లి వడ్డించాలి. ఇందులోకి కారప్పొడిగాని, చట్నీగానీ మంచి కాంబినేషన్. Step 4 ఇందులో పోపుగింజలు వేగినతరువాత కొద్దిగా పసుపు రెండు మీడియం సైజ్ టమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసి కలిపితే టమాటో బాత్ తయారవుతుంది.    Step 5 ఇది సుమారు ముగ్గురు లేక నలుగురికి సరిపోతుంది. సభ్యులను బట్టి పరిమాణం పెంచుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day