Gummadi Vadiyalu By , 2018-02-13 Gummadi Vadiyalu Here is the process for Gummadi Vadiyalu making .Just follow this simple tips Prep Time: 8hour 30min Cook time: 25min Ingredients: బూడిద గుమ్మడికాయ : చిన్నది 1,మినపపప్పు లేక గుండ్లు : ఒక కేజి,పచ్చమిర్చి : 10 కాయలు,జీలక్రర : 2 టీస్పూన్లు,అల్లం : కొద్దిగా,ఉప్పు తగినంత, Instructions: Step 1 ముందుగా మినపగుండ్లను కానీ, లేక పప్పును గానీ ముందురోజు రాత్రి నానబెట్టుకోవాలి (సుమారు 8 గంటలు).  Step 2 అదే సమయంలో బూడిద గుమ్మడి కాయను పైన చెక్కుతీసి ముక్కలుగా కోసుకొని సన్నగా  తురుముకోవాలి. ఈ తురుమును ఒక పలచటి బట్టలో మూటకట్టి వెడల్పాటి పళ్లెంలో ఉంచి దానిమీద ఏదైనా బరువును పెట్టాలి. దీని వల్ల గుమ్మడి తురుములో ఉన్న నీరుఅంతా కిందకు దిగిపోతుంది. Step 3 ఉదయాన్నే నానిన మినపగుండ్లను వడకట్టి అందులో అల్లం, పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేయించుకోవాలి. పిండి గట్టిగా ఉండాలి. జావగా ఉండకూడదు.  Step 4 తరువాత ఈ పిండిలో వడకట్టిన గుమ్మడి తురుమును వేసి బాగా కలిసేటట్లు తిప్పుకోవాలి. అవసరమైతే గుమ్మడి తురుము నుంచి వడకట్టిన నీరు కొద్దిగా కలుపుకోవచ్చు.    Step 5 ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తడిపిన నూలు బట్టమీద చిన్న చిన్న చిన్న వడియాలు లాగా పెట్టుకోవాలి. ఎండలో బాగా ఎండిన తరువాత వీటిని బట్టనుండి వేరుచేసి గాలిచోరని డబ్బాలో నిలవ ఉంచుకోవాలి.   Step 6 ఇవి మరీ ఎక్కువ కాలం నిలవ ఉంచితే పురుగు పట్టే అవకాశం ఉంది కనుక రెండు లేక మూడు నెలలో వాడివేయటం మంచిది. . ఈ వడియాలను కాగిన నూనెలో సిమ్ లో వేయించుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day