mutton pepper fry By , 2018-01-22 mutton pepper fry Here is the process for mutton pepper fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: మటన్ - అరకిలో,,ఉల్లిపాయలు - కప్పు (సన్నగా తరిగినవి),,అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూనులు,,పసుపు - అర టీస్పూను,,టమోటో - అరకప్పు (చిన్నముక్కలుగా తరిగినవి),,కారం - ఒక టీస్పూను,,మిరియాల పొడి - రెండు టీ స్పూనులు,,కొత్తిమీర - పావు కప్పు (సన్నగా తరిగినవి),కరివేపాకు - రెండు రెమ్మలు,,సోంపు - అర టీస్పూను,,మిరియాలు - ఒక టీస్పూను,,గసగసాలు - అర టీస్పూను,,ధనియాల పొడి - అర టీస్పూను,,జీలకర్ర - ఒక టీస్పూను,,దాల్చిన చెక్క - 1,,లవంగాలు - 3,,యాలకులు - 2,,ఉప్పు - సరిపడినంత,,నూనె - తగినంత, Instructions: Step 1 మటన్‌ను బాగా కడిగి ప్రెషర్ కుక్కర్‌లో వేసి, మూడు కప్పుల నీళ్లు, కాస్త పసుపు వేసి పావుగంట సేపు ఉడికించుకోవాలి. ఉడికిన మటన్ తీసి పక్కన పెట్టుకోవాలి.  Step 2 కళాయిలో సోంపు, జీలకర్ర, గసగసాలు, మిరియాలు, లవంగాలు, యాలకులు వేయించాలి. వాటిని చల్లార్చి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.  Step 3 ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడెక్కాక కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.  Step 4 అందులో అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేసి మూడు నిమిషాల పాటూ వేయించాలి.    Step 5 అనంతరం పక్కన పెట్టుకున్న మటన్ ముక్కల్ని అందులో వేసి బాగా వేయించాలి. బాగా వేయిస్తే నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు టమోటో ముక్కలు, కారం, ముందుగా పొడి చేసిన మసాలా, ఉప్పు వేసి కలపాలి. పది నిమిషాలు మీడియం మంట మీద వేగనివ్వాలి.    Step 6 అనంతరం పెప్పర్ పౌడర్ మటన్న ముక్కలపై చల్లి బాగా కలిపి... మూడు నిమిషాల పాటూ వేగనివ్వాలి. అంతే మటన్ పెప్పర్ ఫ్రై సిద్ధమైనట్టే. దీనిపై కొత్తిమీర గార్నిష్ చేస్తే బాగుంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day