Munagaku Pachadi By , 2018-01-04 Munagaku Pachadi Here is the process for Munagaku Pachadi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: మునగాకు - అరకప్పు,,క్యాప్సికం - రెండు,,టొమాటోలు - రెండు,,చింతపండు - కొద్దిగా,,బెల్లం - అరచెంచా, ఉప్పు - తగినంత,,పచ్చిమిర్చి - ఐదారు,,ఆవాలు - అరచెంచా,,మెంతులు - పావుచెంచా,,మినప్పప్పు - చెంచా,,కొబ్బరి - చిన్నముక్క,,ఎండుమిర్చి - నాలుగు,,ఇంగువ - చిటికెడు,,నూనె - మూడు టేబుల్‌స్పూన్లు., Instructions: Step 1 బాణలిలో రెండు చెంచాల నూనె వేడిచేసి మినప్పప్పూ, ఆవాలూ, మెంతులూ వేయించి తరవాత ఎండుమిర్చీ, ఇంగువా వేసేయాలి. రెండు నిమిషాల తరవాత ఈ తాలింపుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.  Step 2 అదే బాణలిలో మరో మూడు చెంచాల నూనె వేడిచేసి క్యాప్సికం ముక్కలూ, పచ్చిమిర్చీ, టొమాటో ముక్కలూ, మునగాకూ, చింతపండూ, బెల్లం వేసి మగ్గించాలి. మునగాకులోని పచ్చివాసన పోయాక దింపేయాలి. Step 3 ఇప్పుడు ముందుగా వేయించిన తాలింపూ, తగినంత ఉప్పూ, కొబ్బరీ, తాలింపూ, మునగాకు మిశ్రమాన్ని మిక్సీలో తీసుకుని మెత్తగా రుబ్బుకుంటే సరిపోతుంది. కమ్మని పచ్చడి సిద్ధం.                
Yummy Food Recipes
Add