Magaya Pachadi By , 2018-01-03 Magaya Pachadi Here is the process for Magaya Pachadi making .Just follow this simple tips Prep Time: 1hour 15min Cook time: 30min Ingredients: పుల్ల మామిడికాయలు: 12,,రాతి ఉప్పు: 2 కప్పులు,,పసుపు: 2 టీస్పూన్లు,,మెంతులు: అరకప్పు,,ఆవాలు: పావుకప్పు,,నూనె: 2 కప్పులు,,కారం: 2 కప్పులు., Instructions: Step 1 మామిడికాయలు నీళ్ళలో వేసి శుభ్రంగా కడగాలి. తరవాత చెక్కు తీసి సన్నని పొడవాటి ముక్కలుగా కోయాలి. ముక్కల్లో ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి ఓ జాడీలో పెట్టుకోవాలి.  Step 2 మూడు రోజుల తరవాత ముక్కలు బయటకు తీసి చేత్తో ముక్కల్ని గట్టిగా పిండాలి. Step 3 ముక్కలు, రసం విడివిడిగా ఎండలో పెట్టాలి. రసం ఒక్కరోజు ఎండలో పెడితే సరిపోతుంది. ముక్కలు మాత్రం రెండు రోజులు ఎండలో పెట్టి తియ్యాలి. చివరగా బాణలిలో మెంతులు వేసి దోరగా వేయించి చల్లారిన తరవాత పొడి చేసి ఉంచాలి.స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె పోసి కాచి దించాలి. Step 4 సగం చల్లారిన తరవాత కారం, ఇంగువ వేసి కలపాలి. పూర్తిగా చల్లారాక మామిడిరసంలో వేసి కలపాలి. తరవాత మామిడి ముక్కలు కూడా వేసి కలిపి జాడీలో పెట్టి మూత పెట్టుకోవాలి. కావలసినప్పుడు కొంచెంకొంచెంగా తీసి వాడుకుంటే పాడవకుండా ఉంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day