panchmela dal By , 2017-12-11 panchmela dal Here is the process for panchmela dal making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: శెనగపప్పు, పెసరపప్పు, మినపప్పు, మసూర్ దాల్ (ఎర్రపప్పు) - అన్నీ ఒక్కో కప్పు చొప్పున,వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది (కచ్చాపచ్చాగా కొట్టాలి),అల్లం - కొద్దిగా (సన్నగా తరగాలి),పెద్ద ఉల్లిపాయ - ఒకటి (సన్న ముక్కలుగా తరగాలి),టొమాటోలు - నాలుగు (తరగాలి),జీలకర్ర - ఒకటిన్నర టీస్పూన్,పచ్చిమిర్చి - ఐదు (సన్నగా తరగాలి),కారం - అర టీస్పూన్,ఎండుమిర్చి – ఒకటి,పసుపు – చిటికెడు,వంటనూనె - మూడు టీస్పూన్లు,తాజా కొత్తిమీర - కొద్దిగా (తరగాలి),ఉప్పు - రుచికి సరిపడా, Instructions: Step 1 పప్పులన్నిటినీ శుభ్రంగా కడిగి లోతైన గిన్నెలో వేసి ఆరు కప్పుల నీళ్లు, కాస్త ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. పప్పులు అడుగంటకుండా, ఉండలు కట్టకుండా మధ్యమధ్యలో కలుపుతూ పావుగంటసేపు ఉడికించాలి. Step 2 ఈ లోగా తాలింపుకి సిద్ధం చేసుకోవాలి. పెద్ద గిన్నెలో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు ఆ వరసలో వేసి కొన్ని నిమిషాలు వేగాక టొమాటో ముక్కలు వేయాలి. Step 3 కొద్దిగా బ్రౌన్ రంగుకి వచ్చాక ఉప్పు, పసుపు, కారం వేసి ఓ మాదిరి మంట మీద ఉడికించాలి. తర్వాత పప్పు మిశ్రమాన్ని వేసి నెమ్మదిగా కదపాలి. పైన కొత్తిమీర చల్లి అలంకరించుకుంటే సరి.                
Yummy Food Recipes
Add