onion pulusu By , 2017-12-01 onion pulusu Here is the process for onion pulusu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఉల్లి పాయలు 4,టమాటో 1,బెండకాయలు 2,వంకాయ 1,పచ్చి మిరపకాయలు 2,కరివే పాకు,వెల్లుల్లి 2 రెబ్బలు,ఆవాలు పావు స్పూన్,మెంతులు పావు స్పూన్,జీలకర్ర పావు స్పూన్,ఎండు మిరపకాయలు 2,ఇంగువ కొద్దిగా,చింత పండు నిమ్మ కాయంత,బెల్లము కొద్దిగా, Instructions: Step 1 చింత పండు ను ఒక గిన్నేలో నీళ్ళూ పోసి నానబెట్టుకోవాలి , స్టవ్ వెలిగించుకుని బాణలి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని , పైన చెప్పిన పోపు దినుసులను వేసి వేగాక, ఉల్లి , టమాటో , వంకాయ , బెండకాయ ముక్కలను , వెల్లుల్లి రెబ్బలను వేసి దోరగా వేగనివ్వాలి . Step 2 ఇప్పుడు నానబెట్టిన చింతపండు ను , నానబెట్టిన నీళ్ళలో నుండి పిప్పిని తీసి వేసి , వేగిన ఉల్లిపాయ మిశ్రమాని వేసి , పసుపు , ఉప్పు, బెల్లము సరిపడునంతగా వేసి స్టవ్ మీద పెట్టాలి , ఒక 5 నిమిషాలు మరిగాక, ఒక 2స్పూన్స వరి పిండిని చిన్న కప్పులోకి తీసుకుని నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలుపుకుని , దానిని స్టవ్ మీద మరుగుతున్న పులుసులో కలిపుకుని కొంత సేపు మరగనివ్వాలి , 15 నిమిషాలు మరిగాక స్టవ్ ఆఫ్ చేస్తే ఉల్లిపాయ పులుసు రెడీ . దీనిని కందపొడి , కంది పచ్చడి లేక పాటోలి తో తింటే బాగుంటుంది.              
Yummy Food Recipes
Add