Strawberry Rava laddu recipe By , 2017-11-25 Strawberry Rava laddu recipe Here is the process for Strawberry Rava laddu recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: 1 కప్పు బొంబాయి రవ్వ,½ కప్పు ఎండుకొబ్బరి పొడి,½ కప్పు పంచదార,¼ కప్పు నెయ్యి,¼ కప్పు స్ట్రాబెర్రీ క్రష్ లేదా జామ్,3 tbsp పాలు కాచి చల్లార్చినవి,¼ కప్పు జీడిపప్పు,¼ కప్పు బాదంపప్పు,1 tsp యాలుకల పొడి,¼ కప్పు కిస్ మిస్,1 tbsp పిస్తాపప్పు తురుము, Instructions: Step 1 ఒక పెనంలో నెయ్యి వేసి వేడిచేయాలి. Step 2 జీడి పప్పు, కిస్ మిస్ వేసి చక్కటి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. Step 3 అందులో బొంబాయి రవ్వ వేసి 3-5 నిమిషాలు సన్నని సెగ మీద వేయించాలి. Step 4 తర్వాత ఎందు కొబ్బరి పొడి, యాలుకల పొడి, బాదం పప్పు తురుము, పంచదార వేసి ఒక రెండు నిమిషాలు సన్నని సెగ మీద కలిపి దించేసుకోవాలి.ఆ మిశ్రమాన్నికొద్ది నిమిషాల పాటు పూర్తిగా కాకుండా కొద్దిగా చల్లారనివ్వాలి.   Step 5 ఈలోపుగా ఒక చిన్న గిన్నెలో స్ట్రాబెర్రీ క్రష్ గానీ, జామ్ గానీ వేసి దాన్ని ఒకసారి కలపాలి.   Step 6 అందులో 3 tbsp ల కాచి చల్లార్చిన పాలు వేసి కలిపి దాన్ని రవ్వ మిశ్రమంలో వేసి బాగా కలపాలి.   Step 7 ఇప్పుడు చేతి నిండా మిశ్రమాన్ని తీసుకొని లడ్డూ లను చుట్టాలి.   Step 8 వాటిని ఎండు కొబ్బరి పొడిలో దొర్లిస్తే చూడడానికి బాగుంటాయి.          
Yummy Food Recipes
Add