coconut mango pulihora By , 2017-11-20 coconut mango pulihora Here is the process for coconut mango pulihora making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బియ్యం : అరకిలో,మామిడికాయ : ఒకటి పెద్దది,ఎండిమిర్చి: ఆరు,దనియాలు : రెండు టీ స్పూన్లు జీలకర్ర : టీ స్పూన్,కొబ్బరి ముక్కలు : అర కప్పు,నూనె : మూడు టేబుల్ స్పూన్లు,పోపుదినుసులు : టీ స్పూన్,కరివేపాకు : రెండు రెమ్మలు ఉప్పు : సరిపడా, Instructions: Step 1 ముందుగా బియ్యం కడిగి పొడిపొడిగా అన్నం వండి పక్కన పెట్టాలి. Step 2 స్టవ్ మీద కళాయి పెట్టి ఎండిమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేపాలి.  వీటిని మిక్సి జార్లో వేసి మిక్సి పట్టాలి.  Step 3 ఇవి మెత్తగా అయ్యిన తరువాత మామిడి ముక్కలు, కొబ్బరి ముక్కలు, పసుపు కాస్త ఉప్పు వేసి మెత్తగా మిక్సి పట్టాలి. Step 4 ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి రెండు టీ స్పూన్లు నూనె వేసి కాగిన తరువాత , మిక్సి వేసిన మామిడి మిశ్రమం వేసి పచ్చి వాసన పోయేవరకు వేపి, దానిలో వండిన అన్నం, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి.   Step 5 ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి మిగిలిన నూనె వేసి కాగిన తరువాత పోపుదినుసులు, ఎండిమిర్చి, కరివేపాకు, వేరుసెనగ గింజలు వేసి వేగాక స్టవ్ ఆపి ఈ పోపును మామిడి, కొబ్బరి మిశ్రమం కలిపిన అన్నంలో వేసి కలపాలి.  అంతే మామిడి కొబ్బరి పులిహోర రెడీ.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day