masala maharani dal By , 2017-11-20 masala maharani dal Here is the process for masala maharani dal making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: కందిపప్పు.... పావు కేజీ,అల్లం... చిన్నముక్క,పచ్చికొబ్బరి... కాస్తంత,ఉల్లిపాయలు... రెండు,పచ్చిమిర్చి... ఆరు,వెల్లుల్లి రెబ్బలు... రెండు,టొమోటోలు... నాలుగు,నూనె... వంద గ్రా.,పసుపు... చిటికెడు,నెయ్యి... రెండు టీ.,జీలకర్ర... ఒక టీ.,ఆవాలు... ఒక టీ.,కరివేపాకు... రెండు రెమ్మలు,నిమ్మకాయ... ఒకటి,కొత్తిమీర... ఒక కట్ట, Instructions: Step 1 కందిపప్పులో కొద్దిగా పసుపు వేసి సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి.  Step 2 అల్లం, వెల్లుల్లి, కొబ్బరిని కలిపి ముద్దగా నూరి ఉంచాలి. * బాణలిలో నూనె పోసి కాగిన తరువాత, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.  Step 3 తరువాత పచ్చిమిర్చి, టొమోటో ముక్కలను కూడా వేసి వేయించాలి. Step 4 ఇప్పుడు విడిగా ఉడికించి ఉంచిన పప్పను ఇందులో వేసి కలపాలి.    Step 5 కాసేపటి తరువాత మసాలా ముద్దను కూడా వేసి బాగా కలిపి, ఉప్పు సరిజూడాలి.    Step 6 విడిగా మరో బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకుతో తాలింపు చేసి ఉడుకున్న పప్పులో కలపాలి.    Step 7 చివర్లో నిమ్మరసం పిండి, కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే ఘుమఘుమలాడే మసాలా మహారాణి దాల్ రెడీ...!!          
Yummy Food Recipes
Add