Tomato Kurma By , 2017-10-31 Tomato Kurma Here is the process for Tomato Kurma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: టమాటాలు - 5,ఉల్లిపాయలు - 12,అల్లంవెల్లుల్లి - 1/2 చెమ్చా,దాల్చిన చెక్క - చిన్నది,లవంగాలు - 3,కారం - 1 చెమ్చా,బిర్యాని ఆకు - తగినంత,పసుపు - తగినంత,నూనె - 4 చెమ్చాలు,కొబ్బరి తురుము - 1/4 కప్పు,పచ్చిమిర్చి - 2,గసగసాలు - 1/2 చెమ్చా,నువ్వులు -1/2 చెమ్చా, Instructions: Step 1 ముందుగా కొబ్బరి, పచ్చిమిర్చి, గసగసాలు, నువ్వులు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.  Step 2 ఆ తర్వాత బాణలిలో ఓ నాలుగు చెమ్చాల నూనె వేసి, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యాని ఆకు వేసి ఒక్క నిమిషం వేయించాలి.  Step 3 ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి.  Step 4 ఇప్పుడు అల్లం, వెల్లుల్లి ముద్ద,  పసుపు, కారం వేసి బాగా కలపాలి.    Step 5 ఆ వెంటనే సన్సగా తరిగిన టమాటాలని ఆ మిశ్రమానికి కలిపి ఉప్పు వేసి కలియబెట్టి మూతపెట్టాలి.   Step 6 సన్నని మంట మీద ఓ పది నిమిషాలు మగ్గిస్తే చాలు.    Step 7 టమాటా బాగా మగ్గాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముద్దని వేసి కలపాలి.   Step 8 అప్పటికే టమాటా లోని నీళ్లు వచ్చి ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా గ్రేవీ కోసం వేరే నీళ్లు పోయక్కర లేదు.   Step 9 ఒకవేళ కూర మరీ గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే చిన్న కప్పు నీళ్లు పోసి పెద్ద మంట మీద రెండు నిమిషాలు ఉంచి ఆపాలి.   Step 10 ఈ కూర పుల్లగా, కొంచం మసాలా వాసనతో రుచిగా ఉంటుంది. ఈ కుర్మాని రైస్ ఐటమ్స్ కి సైడ్ డిష్ గా వాడచ్చు.  
Yummy Food Recipes
Add
Recipe of the Day