mutton methi gravy By , 2014-08-02 mutton methi gravy mutton methi gravy - itsa yummi recipe, healthy and tasty recipe mutton methi gravy easy preparation.. Prep Time: 15min Cook time: 45min Ingredients: తగినంత ఉప్పు, 1 టీస్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ నూనె, 1 బిర్యానీ ఆకు, 1 టీస్పూన్ గరం మసాల, 1 టీస్పూన్ కారం, చిటికెడు ఇంగువ, 1 టేబుల్ స్పూన్ ఎండిన మెంతిఆకులు, 1 టేబుల్ స్పూన్ ఫ్రేష్ క్రీమ్, 2 టేబుల్ స్పూన్ యోగర్ట్, 3 పచ్చిమిర్చి, 1 టమాట, 5 వెల్లుల్లి, 2 ఉల్లిపాయలు, 500 గ్రా. ఆకుకూర, 500 గ్రా. మటన్, Instructions: Step 1 ముందుగా ఆకు కూరను మీడియంగా ఉడికించుకుని మిక్సీలో ఆకుకూర పచ్చిమిర్చి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. Step 2 ముందుగా ప్రెజర్ కుక్కర్ లో కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక అందులో ఇంగువ, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. Step 3 తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. తర్వాత అందులో వెల్లుల్లి మరియు మటన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీడియం మంట మీద మటన్ 5నిముషాలు ఉడకనివ్వాలి Step 4 టమోటో మెత్తగా ఉడుతున్నప్పుడు, అందులో కారం, మరియు ఎండిన మెంతి ఆకులు వేసి మరో రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి. Step 5 ఇప్పుడు అందులో రెండు కప్పులు నీరు పోసి మూత పెట్టి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకొని, కుక్కర్ లో ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత గరం మసాలా, నెయ్యి, మరియు తాజా క్రీమ్ ను వేసి మిక్స్ చేయాలి . అంతే మటన్ మేతి రిసిపి రెడీ .
Yummy Food Recipes
Add