Rajma pulao recipe By , 2017-10-23 Rajma pulao recipe Here is the process for Rajma pulao making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: రాజ్మా : ఒక కప్పు,ఉల్లిపాయలు : రెండు,బియ్యం : రెండు గ్లాసులు,కొత్తిమీర ఒక కట్ట,నెయ్యి : నాలుగు టీ స్పూన్స్,ఉప్పు : తగినంత,పచ్చిమిర్చి : ఆరు,అల్లం,వెల్లుల్లి ఫేస్ట్ : ఒక టీ స్పూన్,టమోటాలు : రెండు,కారం : ఒక టీ స్పూన్,పసుపు : పావు టీ స్పూన్,ధనియాలపొడి : అర టీ స్పూన్,గరంమసాలా : 2 గ్రాములు, Instructions: Step 1 ముందుగా రాజ్ మా గింజలను ముందురోజు రాత్రి  నానబెట్టుకోవాలి. తర్వాత వీటిని కాస్త ఉప్పు వేసి ఉడుకించుకోవాలి. *బియ్యాన్ని కూడా కడిగి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నెపెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి.  Step 2 ఇందులో ఉల్లిపాయ ముక్కలు, గరంమసాలా వేసి దోరగా వేయించుకోవాలి.  Step 3 ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ఫేస్ట్, పచ్చిమిర్చి, కారం, పసుపు, ధనియాలపొడి, పుదీనా వేసి మరి కొంచెం సేపు ఫ్రై చేయాలి. *ఇప్పుడు టామాటా ముక్కలు, ఉడికించుకున్న రాజ్మా వేసి కలిపి మరో పది నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. Step 4 తరువాత స్టవ్ వెలిగించి కొంచం మందంగా ఉన్న గిన్నె పెట్టి అందులో నాలుగు గ్లాసుల నీళ్ళు పోసి మరగబెట్టి నీళ్ళు పొంగుతుప్పుడున్న  నానబెట్టిన బియ్యాన్ని వేసి తగినంత ఉప్పు కలిపి మూత పెట్టాలి.    Step 5 మూడు వంతులు ఉడికిన తర్వాత అన్నాన్ని దించేసుకోవాలి.    Step 6 ఓ గిన్నెలో సగం అన్నాన్ని ఓ పొరలా వేయాలి. తర్వాత రాజ్ మా కూరను వేయాలి.    Step 7 తర్వాత మిగిలిన అన్నాన్ని వేసి స్టవ్ మీద పెట్టి అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత దించుకోవాలి.   Step 8 చివరిలో కొత్తిమీర చల్లుకొని వేడి వేడి గా  రాజ్మా పలావు సర్వ్ చేసుకోవాలి          
Yummy Food Recipes
Add
Recipe of the Day