Kashmiri Palak kofta curry By , 2017-10-23 Kashmiri Palak kofta curry Kashmiri Palak kofta curry , Food, food recipes Prep Time: 10min Cook time: 20min Ingredients: పాలకూర - రెండు కట్టలు,జీలకర్ర - అర టీ స్పూన్,స్వీట్ క్రీమ్ - 2 టీ స్పూన్లు,ఇలాచి పౌడర్- అర టీస్పూను,కసూరీ మేథీ - టీ స్పూను,ఉప్పు - తగినంత,నూనె - సరిపడినంత,ధనియాలపొడి - టీ స్పూను,మైదా - రెండు టేబుల్ స్పూన్లు,జీడిపప్పు - 50 గ్రాములు,నీరు - తగినంత, Instructions: Step 1 ముందుగా పాలకూరను మెత్తగా ఉడికించి, చల్లారిన తరవాత కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. *తరువాత పాన్‌లో కొద్దిగా నూనె వేసి కాగాక జీలకర్ర వేసి దోరగా వేయించి  మైదా వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పాలకూర పేస్ట్‌లో వేసి బాల్స్ లా చేసుకోవాలి.  Step 2 తరువాత స్టవ్ పై పాన్‌ పెట్టి  నూనె పోసి  కాగిన తరవాత అందులో ఈ కోఫ్తాలను  వేసి వేగాక ప్లేట్ లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. Step 3 ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ పై  పాన్‌ పెట్టి జీడిపప్పు పేస్ట్ వేసి కొద్దిగా ఉడికిన తరవాత ఇలాచి పౌడర్ ,ధనియాలపొడి, కసూరీ మేథీ, స్వీట్ క్రీమ్ వేసి ఐదు నిముషాలు ఉడికాక గ్రేవీ తయారవుతుంది.  Step 4 ఇప్పుడు  వేయించుకున్న  కోఫ్తాలు వేసి మరొక ఐదునిముషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని వేడి వేడి రైస్ తో సర్వ్ చేసుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day