alasandalu curry recipe By , 2017-07-03 alasandalu curry recipe Here is the process for alasandalu curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: అలసందలు - 50 గ్రాములు,,పుట్టగొడుగులు - 200 గ్రాములు,,ఉల్లి తరుగు - పావు కప్పు,,టమాటో తరుగు - అర కప్పు,,పచ్చిమిర్చి తరుగు - రెండు టేబుల్ స్పూన్లు,,అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను,,కారం - అర టీ స్పూను,పసుపు - చిటికెడు,,ధనియాల పొడి - అర టీ స్పూను,,గరంమసాలా - టీ స్పూను,,జీడిపప్పులు - ఎనిమిది,,జీలకర్ర - టీ స్పూను,,కొత్తిమీర తరుగు - రెండు టేబుల్ స్పూన్లు,,నెయ్యి - టేబుల్ స్పూను, ఉప్పు - తగినంత., Instructions: Step 1 అలసందలను రెండు గంటలసేపు నానబెట్టి, కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకూ ఉడికించి దించేయాలి.  Step 2 పాన్లో నెయ్యి కరిగాక ఉల్లితరుగు వేయించి, అల్లంవెల్లుల్లి పేస్ట్ జత చేసి రెండు నిముషాలు వేయించి, తీసి పక్కనుంచాలి.  Step 3 ధనియాల పొడి, జీడిపప్పు, టమాటో తరుగు, కారం, పసుపు, గరంమసాలా జత చేసి, మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.  Step 4 పాన్లో నూనె కాగాక, జీలకర్ర వేయించాలి. పుట్టగొడుగు ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు జత చేసి వేగాక మసాలా వేసి వేయించాలి Step 5 ఉడికించిన అలసందలు, అరకప్పు నీరు పోసి, మూతపెట్టి మంట తగ్గించాలి.  Step 6 గ్రేవీ చిక్కగా అయిన తర్వాత దించేసి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day