pudina palau recipe By , 2017-09-27 pudina palau recipe Here is the process for pudina palau making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పుదీనా - 2 కట్టలు,బాస్మతి బియ్యం - 2 కప్పులు,తాజా కొబ్బరి తురుము - పావుకప్పు,పచ్చిమిర్చి - 3,ఉల్లిపాయ - ఒకటి ( సన్నగా తరగాలి),అల్లం వెల్లుల్లి - 1 టీస్పూన్‌,లవంగాలు - 4,యాలకులు - 4,దాల్చిన చెక్క - 4,పలావు ఆకులు - 4,అనాసపువ్వు - ఒకటి,వేయించిన జీడిపప్పు - పావుకప్పు,నెయ్యి - 2 టీస్పూన్లు,ఉప్పు - సరిపడినంత, Instructions: Step 1 పుదీనా ఆకులన్నీ తుంచి బాగా కడగాలి. మిక్సీలో పుదీనా ఆకులు, కొబ్బరి, పచ్చిమిర్చి, అరటీస్పూను ఉప్పు వేసి మెత్తగా రుబ్బాలి.  Step 2 రెండు కప్పుల బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి నాలుగు కప్పుల నీళ్ళు పోసి నానబెట్టాలి.  Step 3 స్టవ్‌ మీద మందపాటి గిన్నె లేదా కుక్కర్‌ పెట్టి నెయ్యి వేసి కాగాక మసాలా దినుసులన్నీ వేయాలి.  Step 4 తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.    Step 5 అవి వేగాక పుదీనా ముద్ద వేయాలి. ముదురాకుపచ్చ నుంచి లేతాకుపచ్చ రంగులోకి మారే వరకూ దీన్ని వేయించాలి.    Step 6 తర్వాత బియ్యం వేసి గరిటెతో బాగా కలపాలి. కుక్కరయితే వెయిట్‌ పెట్టకుండానూ, గిన్నె అయితే మూతపెట్టి అన్నం పొడిపొడిగా ఉడికించాలి.    Step 7 అన్నం ఉడికింది అనుకున్న తరువాత వేయించిన జీడిపప్పు వేసి తిప్పి వేడి వేడిగా వడ్డించాలి.          
Yummy Food Recipes
Add