mango fried rice recipe By , 2017-09-27 mango fried rice recipe Here is the process for mango fried rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: పొడి పొడిగా వండిన అన్నం.. 6 కప్పులు,మామిడి, కొబ్బరి తురుము.. చెరో 2 కప్పులు,మొలకెత్తిన పెసళ్లు.. 2 కప్పులు,క్యారెట్, క్యాప్సికమ్ తరుగు... చెరో 2 కప్పులు,మినప్పప్పు, నువ్వులు.. చెరో 4 టీ.,జీడిపప్పు.. వంద గ్రా.,శెనగపప్పు, మినప్పప్పు.. 2 టీ.,కొత్తిమీర తరుగు.. 4 టీ.,ఆవాలు, జీలకర్ర,,పసుపు.. 2 టీ. చొప్పున,పచ్చిమిర్చి.. 10,పసుపు.. 2 టీ.,నూనె, ఉప్పు.. తగినంత, Instructions: Step 1 ముందుగా నువ్వులు, మినప్పప్పులను వేయించి పొడిచేసి ఉంచుకోవాలి.  Step 2 పొడి పొడిగా వార్చిన అన్నంలో నువ్వులు, మినప్పప్పు పొడితోపాటు మామిడి, కొబ్బరి తురుము, పసుపులను వేసి బాగా కలియబెట్టాలి.  Step 3 తరువాత మొలకెత్తిన పెసళ్లను ఉడికించి ఉంచాలి.  Step 4 ఇప్పుడు బాణలిలో కాస్త నూనె వేసి జీడిపప్పు, శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా వేయించాలి.    Step 5 అందులోనే క్యాప్సికం, క్యారెట్ తరుగు, పెసళ్లను వేసి మరికాసేపు వేయించాలి.   Step 6 ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలపాలి. చివర్లో కొత్తిమీర తరుగు పైన చల్లాలి. అంతే రుచికరమైన మ్యాంగో ఫ్రైడ్‌రైస్ తయార్..!!              
Yummy Food Recipes
Add
Recipe of the Day