vegetable pulav recipe By , 2017-09-27 vegetable pulav recipe Here is the process for vegetable pulav making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బియ్యం : అర కిలో,కారెట్ : నాలుగు అయిదు ( చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి ),బీన్సు: వంద గ్రాములు ( చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి ),బంగాళా దుంపలు : నాలుగు ( చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి ),ఉల్లిపాయలు : అయిదు ఆరు ( పొడుగ్గా చీలికలు చేసుకోవాలి),కాలిఫ్లవర్: ఒక చిన్న పువ్వు ( కావాలంటే వేసుకోవచ్చు ),పచ్చి బఠాణీ : ఒక కప్ ( నాన బెట్టినవి, లేదా తాజావి ),లవంగాలు: అయిదు ఆరు,యాలకులు : అయిదు ఆరు,దాల్చిన చెక్క : అయిదు ఆరు చిన్న ముక్కలు,అల్లం వెల్లుల్లి ముద్ద : రెండు టీ స్పూన్లు,నూనె , నేయ్యి లేదా డాల్డా : తగినంత,పచ్చిమిర్చి: అయిదు ఆరు( చీలికలు చేసుకోవాలి),ధనియాలు, జీలకర్ర పొడి: రెండు స్పూన్లు ( కావలిస్తే వేసుకోవచ్చు ),కారం: ఒక స్పూను ( కారం ఇష్ట పడేవాళ్ళు వేసుకోవచ్చు ),పసుపు: చిటికెడు ( రంగు కోసం ),ఉప్పు : రుచికి తగినంత,నీరు: ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీరు,కొత్తిమీర: ఒక కట్ట,పుదినా : అర కట్ట ( తినేవారు వేసుకోవచ్చు),జీడిపప్పు: పది పదిహేను ( కావాలంటే వేసుకోవచ్చు),బిర్యాని ఆకు : రెండు మూడు, Instructions: Step 1 ముందుగా బియ్యం కడిగి నీటిలో ఒక అరగంట నాన నివ్వాలి. కూరలన్నీ తరిగి పెట్టుకోవాలి. Step 2 ఒక మందంగా ఉన్న గిన్నె గాని కుక్కర్ గాని తీసుకొని గ్యాసు మీద పెట్టాలి.  Step 3 అందులో సుమారు రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి.  Step 4 నూనె కాగాక అందులో లవంగాలు, యాలకులు , జీడి పప్పు, బిర్యాని ఆకు మరియు చెక్క వేసి వేయించాలి.   Step 5 ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి.ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వెయ్యాలి. అది పచ్చి వాసన పోయే దాక వేయించి పచ్చి మిర్చి వేసుకోవాలి.    Step 6 వేగాక అందులో తరిగి ఉంచుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి.అవి కొంచెం వేగ నివ్వాలి.    Step 7 ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వెయ్యాలి. అన్ని బాగా కలిపి కొత్తిమీర, పుదినా, ఉప్పు, పసుపు, కారం మరియు ధనియాలు జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి.    Step 8 ఇప్పుడు ఒక వంతు బియ్యానికి రెండు వంతులు నీరు పోసి అన్నీ బాగా కలిపి మూత పెట్టుకోవాలి.   Step 9 కుక్కర్ ఐతే మూడు కూతలు రాగానే కట్టేయ్యాలి. గిన్నెలో ఐతే అన్నం ఉడికాక గ్యాసు కట్టేయ్యాలి. పులావ్ తో పాటు ఉల్లిపాయ రైతా చేసుకుంటే బాగుంటుంది.      
Yummy Food Recipes
Add