kadai murgh recipe By , 2017-09-15 kadai murgh recipe Here is the process for kadai murgh making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: చికెన్-200గ్రా,,నూనె లేదా నెయ్యి-15 గ్రా,,ఉల్లిపాయ తరుగు-అరకప్పు,,అల్లం వెల్లుల్లి పేస్ట్-2 టీ స్పూన్లు,,పసుపు-చిటికెడు,,ధనియాల పొడి-టీ స్పూన్,,కారం-టీ స్పూన్,,టొమాటో ముక్కలు-పావుకప్పు,,టొమాటో గుజ్జు-అర కప్పు, ధనియాలు-అర టీ స్పూన్,,ఎండుమిర్చి-2,,ఉప్పు-తగినంత,,వెనిగర్-5 మి.లీ,,క్యాప్సికమ్-10 గ్రా (రంగురంగుల క్యాప్సికమ్ తీసుకోవాలి),,కొత్తిమీర-కట్ట,,గరం మసాల-2 గ్రా, Instructions: Step 1 చికెన్‌ని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.  Step 2 పాన్‌లో నూనె లేదా నెయ్యిని వేడి చేసి అందులో ఉల్లిపాయ తరుగు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.  Step 3 తర్వాత అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కాసేపు వేయించి టొమాటో ముక్కలు కూడా వేసి కలిపి సెగ మీద ఉంచాలి.  Step 4 అందులో టొమాటో గుజ్జు, తగినన్ని నీటిని చేర్చాలి.   Step 5 ఈ మిశ్రమంలో ఉప్పు, ఎండుమిర్చి, కచ్చాపచ్చాగా దంచిన ధనియాలు, వెనిగర్, గరం మసాల పౌడర్ వేయాలి.    Step 6 ఇవన్నీ ఉడుకుతుండగా చికెన్ ముక్కలను కలిపి గ్రేవి చిక్కపడి ఎరుపు రంగు వచ్చే వరకు ఉడికించాలి.    Step 7 దించే ముందు కావాలనుకుంటే కలర్ క్యాప్సికమ్ ముక్కలను వేసి రెండు నిమిషాలపాటు ఉంచి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి          
Yummy Food Recipes
Add