fry pandugappa recipe By , 2017-09-12 fry pandugappa recipe fry pandugappa , Food, food recipes Prep Time: 15min Cook time: 15min Ingredients: పండుగప్ప ఫ్రై,పండుగప్ప చేపను శుభ్రం చేసుకుని ముక్కలు చేసుకోవాలి. వీటిలో అల్లంవెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా నూనె వేసి బాగా,కలుపుకోవాలి.,పండుగప్ప చేపలు - కేజీ,ఉల్లిపాయలు - 2 పెద్దవి,పచ్చిమిర్చి - 5 (మధ్యకు చీల్చుకోవాలి),అల్లంవెల్లుల్లి పేస్టు - 1 టేబుల్‌ స్పూన్‌,కారం - 2 టేబుల్‌ స్పూన్లు,పసుపు - చిటికెడు,ఉప్పు - సరిపడా,నూనె - తగినంత,కొత్తిమీర తురుము - 2 టేబుల్‌ స్పూన్లు, Instructions: Step 1 పండుగప్ప చేపను శుభ్రం చేసుకుని ముక్కలు చేసుకోవాలి.  Step 2 వీటిలో అల్లంవెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఓ గంట అలాగే ఉంచాలి.  Step 3 ఇలా మాగేట్‌ చేసి పెట్టుకున్న చేపముక్కల్ని వేయించే ముందు ఒకసారి మళ్లీ కలుపుకోవాలి. పొయ్యి వెలిగించి చిన్న మూకుడు పెట్టి రెండు ముక్కలు వేగడానికి సరిపడా నూనె పోసుకుని వేడి చెయ్యాలి.  Step 4 రెండు ముక్కల చొప్పున వేపి పక్కన పెట్టుకోవాలి.    Step 5 అదే మూకుడులోనే ఉల్లిపాయలు వేగడానికి అవసరమైన నూనె మాత్రమే ఉంచి మిగిలింది తీసివేయాలి.    Step 6 అందులో ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపాలి.    Step 7 ఉల్లిపాయ ముక్కలకు పట్టడానికి అందులో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేయాలి.    Step 8 కొత్తిమీర తురుము, ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసుకొని ఆఖరులో వేపి పెట్టుకున్న ముక్కల్ని వేసి గరిటెతో ముక్క చితకకుండా తిప్పుకోవాలి.    Step 9 అంతే పండుగప్ప ఫ్రై రెడీ. చాలా రుచిగా ఉంటుంది.      
Yummy Food Recipes
Add