vizag chicken biryani recipe By , 2017-09-09 vizag chicken biryani recipe Here is the process for vizag chicken biryani making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బియ్యం - అర కిలో,,చికెన్‌ - అర కిలో,,పెరుగు - పావు లీటర్‌,డాల్డా - 100 గ్రా||,,నిమ్మకాయలు - 1,,పచ్చిమిర్చి - 6,కారం - 1 స్పూను,,ఉప్పు - తగినంత,కొత్తిమీర - 1 కట్ట,,పుదీనా - 1 కట్ట,,అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 2 టేబుల్‌ స్పూన్లు,ఉల్లిగడ్డలు - 3 పెద్దవి,,లవంగాలు - 5,యాలుకులు - 4,,దాల్చిన చెక్క - కొంచెం,,షాజీర - టీ స్పూను, Instructions: Step 1 డాల్డాలో ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించి విడిగా పెట్టుకోవాలి. కడిగిన చికెన్‌ను పెద్ద గిన్నెలో వేసుకోవాలి.  Step 2 దానికి పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, వేయించిన ఉల్లిగడ్డముక్కలు సగం, ఉప్పు, కారం, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మకాయ రసం, పెరుగు, లవంగాలు, యాలుకలు, దాల్చిన చెక్క, షాజీర, డాల్డా కూడా కొంచెం కలిపి ఒక గంట నానబెట్టాలి.  Step 3 తర్వాత బియ్యం సగం ఉడికాక (అంటే అన్నం పలుకుగా వుండాలి) నీళ్లు మొత్తం వొంపేయాలి.  Step 4 ఆ బియ్యాన్ని, దినుసులన్నీ కలిపిన చికెన్‌ మిశ్రమం పైన వేయాలి.    Step 5 మిగిలిన డాల్డా, కొంచెం కొత్తిమీర, పుదీనా ఆకులు, వేపిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా నిమ్మకాయ రసం కూడా బియ్యం పైన వేసి పది నిమిషాలు ఉడికించాలి.   Step 6 ఆ తర్వాత సన్న సెగ మీద మరో పదినిమిషాలు ఉంటే చాలు. ఉడికేటప్పుడు ఆవిరి పోకుండా చూసుకోవాలి. అంతే ఘుమఘుమలాడే చికెన్‌ బిర్యానీ రెడీ.    Step 7 తినేముందు చికెన్‌... అన్నం కలిసేలా కలియదిప్పాలి. మటన్‌ బిర్యానీ కూడా ఇలాగే చేసుకోవచ్చు.          
Yummy Food Recipes
Add
Recipe of the Day