noodles samosa recipe By , 2017-08-13 noodles samosa recipe Here is the process for noodles samosa making .Just follow this simple tips Prep Time: 25min Cook time: 20min Ingredients: మైదా - 250 గ్రా,,డాల్డా లేదా నెయ్యి - 50 గ్రా.,,ఉప్పు - చిటికెడు,,ఉడికించిన నూడుల్స్ - కప్పు,,ఉల్లి తరుగు లేదా ఉల్లిపరక తరుగు - పావు కప్పు,,క్యారట్, బీన్స్ ముక్కలు - పావు కప్పు,,క్యాబేజీ తరుగు - పావు కప్పు,,ఉప్పు - తగినంత,,మిరియాలపొడి - పావు టీ స్పూను,,అజినమోటో - చిటికెడు,,నూనె - తగినంత., Instructions: Step 1 జల్లించిన మైదాలో కరిగించిన డాల్డా వేసి బాగా కలపాలి.  Step 2 తరవాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీలా కలిపి మూత పెట్టాలి. వెడల్పాటి ప్యాన్‌లో రెండు టీ స్పూన్ల నూనె వేడి చేసి ఉల్లి తరుగు వేసి మెత్తబడేవరకు వేయించాలి.  Step 3 తరవాత కూరగాయ ముక్కలు వేసి వేగాక అజినమోటో వేసి కలిపి, ఉడికించిన నూడుల్స్,తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి నీటి త డి పోయేవరకు వేయించి దింపేయాలి.  Step 4 కలిపి పెట్టుకున్న పిండిలో కొద్దిగా నూనె వేసి మరోమారు కలిపి చిన్నచిన్న ఉండలు చేసుకోవాలి.  Step 5 ఒక్కో ఉండను పొడిపిండి అద్దుకుంటూ పలుచగా పూరీలా ఒత్తుకోవాలి.  Step 6 దీనిని చాకుతో రెండు భాగాలుగా త్రికోణంగా కట్ చేసి, ఒక్కో ముక్క తీసుకుని అంచులు తడిచేసి కోన్‌లా మడిచి చెంచాడు నూడుల్స్ మిశ్రమాన్ని పెట్టి, అంచులు విడిపోకుండా ఒత్తి మూసేయాలి.  Step 7 వేడినూనెలో ఈ సమోసాలు బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీయాలి.  
Yummy Food Recipes
Add