malai peda recipe By , 2017-08-03 malai peda recipe Here is the process for malai peda making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: చిక్కటి పాలు - రెండున్నర కప్పులు;,పల్చటి పాలు - రెండున్నర కప్పులు;,కుంకుమ పువ్వు - కొద్దిగా;,నిమ్మ ఉప్పు - పావు టీ స్పూను;,కార్న్ ఫ్లోర్ - 2 టీ స్పూన్లు (పల్చటి పాలలో వేసి కరిగించాలి);,ఏలకుల పొడి - అర టీ స్పూను;,పంచదార - 4 టీస్పూన్లు;,పిస్తా పప్పులు - టీ స్పూను (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి), Instructions: Step 1 నాలుగు టీ స్పూన్ల చిక్కటి పాలను పక్కన ఉంచి, మిగిలిన చిక్కటి పాలకు, పల్చటి పాలను జత చేసి స్టౌ మీద ఉంచి మరిగించాలి.    Step 2 అంచులకు అంటుకోకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి.  Step 3 చిన్న పాత్రలో నాలుగు టీ స్పూన్ల చిక్కటి పాలు, కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి.  Step 4 మూడు టేబుల్ స్పూన్ల నీళ్లలో నిమ్మ ఉప్పు వేసి కలిపి, మరుగుతున్న పాలలో చిలకరించాలి.  Step 5 నీళ్లలో కరిగించిన కార్న్‌ఫ్లోర్, పంచదార వేసి బాగా కలిపి చూడటానికి కోవాలా అయ్యేవరకు ఉంచాలి.  Step 6 కుంకుమ పువ్వు మిశ్రమం, ఏలకుల పొడి వేసి బాగా కలిపి దించి, చల్లారనివ్వాలి.  Step 7 ఈ మిశ్రమాన్ని పేడాలుగా చేసుకోవాలి. పిస్తా తరుగుతో అలంకరించి, సుమారు గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి, తీసిన పావు గంటకు అందించాలి. ఇవి రెండు మూడురోజులు తాజాగా ఉంటాయి.    
Yummy Food Recipes
Add