chilly paneer making recipe By , 2017-07-04 chilly paneer making recipe Here is the process for chilly paneer making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: పనీర్‌ : 250 గ్రా.,ఉల్లిపాయలు: 200 గ్రా.,పచ్చి మిర్చి : 4 లేదా 5,టొమాటోలు: 2 (పెద్దవి),అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ : 2 టేబుల్‌ స్పూన్లు,ఉల్లిపాయ పేస్ట్‌ : 2 టేబుల్‌ స్పూన్లు,టొమాటో ప్యూరీ : 2 టేబుల్‌ స్పూన్లు,సోయా సాస్‌ : 2 టేబుల్‌ స్పూన్లు,చిల్లీ సాస్‌ : 1 టీస్పూన్‌,మిరియాల పొడి: 1/2 టీ స్పూన్‌,నీళ్ళు : 1/2 కప్పు,నూనె : 2 కప్పులు,ఉప్పు : రుచికి తగినంత, Instructions: Step 1 కాప్సికమ్‌ను, ఉల్లిపాయలను సన్నగా ముక్కలుగా తరుక్కోవాలి. పనీర్‌ను పెద్ద ముక్కలుగా చేసుకోవాలి.  Step 2 పచ్చి మిరపకాయలను కోసి పెట్టుకోవాలి. టొమాటోలను చిన్న ముక్కలుగా చేసి పక్కకు పెట్టుకోవాలి.  Step 3 పొయ్యి మీద బాణలి పెట్టి అందులో నూనె పోసి కాప్సికమ్‌, పనీర్‌, ఉల్లిపాయ ముక్క లు, టొమాటోలు ఒక దాని తర్వాత చిటికెడు ఉప్పు వేస్తూ వేసి వేయించి ఒక ప్లేట్‌లో తీసి పెట్టుకోవాలి.  Step 4 నూనెను తిరిగి వేడి చేసి, దానిలో ఉల్లిపాయ పేస్ట్‌ వేసి రెండు నిమిషాలు వేయించాలి.  Step 5 అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి దాన్ని కూడా రెండు నిమిషాలు వేగనివ్వాలి.  Step 6 తర్వాత టొమాటో ప్యూరీ వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి.  Step 7 ఇప్పుడు అందులో కారం, మిరి యాల పొడి వేసి ఒక అర నిమిషం పాటు వేగనివ్వాలి.  Step 8 అందులోనే చిల్లీ సాస్‌, సోయా సాస్‌ వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి.  Step 9 తర్వాత తరిగి పెట్టుకున్న మిరపకాయలు వేసి ఒక నిమిషం తర్వాత కాప్సికమ్‌, పనీర్‌ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి నీళ్ళు పోసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.  Step 10 తర్వాత మూత తీసి ఒక నిమిషం ఉంచి దించేయాలి. అంతే చిల్లీ పనీర్‌ రెడీ.
Yummy Food Recipes
Add