bisi bele bath recipe By , 2017-07-25 bisi bele bath recipe Here is the process for bisi bele bath making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బియ్యం - పావుకేజీ,,కందిపప్పు - కప్పు,,క్యారెట్, బంగాళాదుంపలు - రెండు చొప్పున,,బఠాణీలు - పావుకప్పు,,బీన్స్ - నూటయాభై గ్రా,,టమాట - ఒకటి,,ఉల్లిపాయలు - నాలుగు,,ఉప్పు - రుచికి తగినంత,,నెయ్యి - యాభై గ్రా,,పసుపు - కొద్దిగా,,నూనె - మూడుచెంచాలు,,చింతపండు - పాతిక గ్రా,,ఆవాలు, జీలకర్ర - అరచెంచా చొప్పున,,కరివేపాకు రెబ్బలు - రెండు,,ఇంగువ - కొద్దిగా,,జీడిపప్పు పలుకులు - పావుకప్పు.,,మసాలా కోసం: ,ధనియాలు, మినప్పప్పు, కందిపప్పు - నాలుగుచెంచాల చొప్పున,,సెనగపప్పు - రెండు చెంచాలు,,ఎండుమిర్చి - పది,,మరాఠీమొగ్గ, దాల్చినచెక్క - మూడు చొప్పున,,లవంగాలు - నాలుగు,,యాలకులు - ఒకటి,,కొబ్బరితురుము - కప్పు., Instructions: Step 1 కొబ్బరితురుము తప్ప మసాలా దినుసులన్నింటినీ నూనెలో వేయించుకుని చల్లారాక పొడిచేసుకోవాలి.  Step 2 అందులో కొబ్బరి తురుమును చేర్చాలి. చట్నీలా తయారైన దీన్ని పక్కనపెట్టుకోవాలి.  Step 3 బియ్యం, కందిపప్పు, కూరగాయముక్కలన్నింటినీ కుక్కర్‌లో తీసుకుని పొయ్యిమీద పెట్టాలి.  Step 4 ఒక కూత వచ్చాక దింపేయాలి. ఆ అన్నాన్ని మళ్లీ పొయ్యిమీద పెట్టి ఉడికించాలి.  Step 5 ఐదునిమిషాలయ్యాక చింతపండు గుజ్జు చేర్చాలి.  Step 6 ఇప్పుడు పసుపు, ఉప్పు వేయాలి. సిద్ధంచేసుకున్న మసాలా కూడా చేర్చి బాగా కలపాలి  Step 7 ఇది కాస్త పలుచగానే ఉండాలి కాబట్టి కాసిని నీళ్లు చేర్చుకోవాలి.  Step 8 అన్నం తయారయ్యాక దింపేయాలి.  Step 9 బాణలిలో నెయ్యి కరిగించి ఇంగువ, జీడిపప్పు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేయించి.. ఈ అన్నంపై వేసి బాగా కలిపితే నోట్లో వేసుకోగానే కరిగిపోయే బిసీబెళెబాత్ సిద్ధం.  
Yummy Food Recipes
Add