kadai paneer recipe By , 2017-07-13 kadai paneer recipe Here is the process for kadai paneer making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: పనీర్ – 100 గ్రా,బటర్ – 30 గ్రా;,ఉల్లిపాయ పేస్ట్ – 100 గ్రా,జీడిపప్పు పేస్ట్ – 10 గ్రా;,టొమాటో పేస్ట్ – 50 గ్రా,నూనె – ఒక టీ స్పూను;,మిరప పొడి – ఒక టీ స్పూను;,కొత్తిమీర – కొద్దిగా,జీరాపొడి – అర టీ స్పూను,మెంతిపొడి – అర టీ స్పూను,పసుపు – అర టీ స్పూను,పంచదార – అర టీ స్పూను,రెడ్ ఫుడ్ కలర్ – రెండు చుక్కలు,ఉప్పు – తగినంత;,నీరు – తగిననంత, Instructions: Step 1 స్టౌ మీద బాణలి పెట్టి తగినంత నూనె పోసి వేడయ్యాక దానిలో పనీర్ వేసి వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి.  Step 2 తరువాత అదే బాణలిలో బటర్ వేసి, బటర్ బాగా కాగాక ఉల్లిపాయ పేస్ట్, జీడిపప్పు పేస్ట్, టొమాటో పేస్ట్ వే సి బాగా వేయించాలి. Step 3 గోధుమరంగులోకి వచ్చే దాకా వేయించిన తరవాత అందులో మిరప్పొడి, జీరాపొడి, పసుపు, మెంతిపొడి, పంచదార, రెడ్‌కలర్ చుక్కలు, తగినంత ఉప్పు వేసి వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోయాలి.  Step 4 వీటన్నిటినీ బాగా ఉడికేదాకా ఉంచాలి. అప్పుడు గ్రేవీలాగ వస్తుంది. Step 5 ఇప్పుడు ముందుగానే వేయించి ఉంచుకున్న పనీర్ ముక్కలను ఇందులో వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి.  Step 6 కాసేపు కలిపాక కొంతసేపటికి దానిలోనుంచి నూనె పైకి తేలుతుంది.  Step 7 అప్పుడు స్టౌవ్ ఆపేసి తయారైన పనీర్ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి వేడి గ సర్వ్ చేసుకోవచ్చు.  
Yummy Food Recipes
Add
Recipe of the Day