badam gajar barfi recipe By , 2017-06-30 badam gajar barfi recipe Here is the process for badam gajar barfi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: గాజర్‌ తురుము-1 కిలో,బాదం పాలు-1 లీ,యాల కులు-8,కర్జూరం పేస్ట్‌-3 టేబుల్‌ స్పూన్లు,కిస్‌మిస్‌-1 టేబుల్‌ స్పూన్‌,జీడిపప్పు పేస్ట్‌ -3 టేబుల్‌ స్పూన్లు,బాదం తరుగు- 1 టేబుల్‌ స్పూన్‌, Instructions: Step 1 కప్పు బాదం పప్పుని చల్లని నీళ్లలో లేదా వేడి నీళ్ళలో వేసి పొట్టు తీయాలి.   Step 2 తరవాత బాదం పప్పులో లీటరు నీళ్ళు పోసి మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్‌ చేసుకోవాలి.  Step 3 కాస్త పల్చగా వచ్చేలా బ్లెండ్‌ చేసి నెట్టతో వడగట్టి పక్కనపెట్టుకోవాలి. తయారుచేసే విధానం: Step 4 ముందుగా ఖర్జూరాలని నాలుగు గంటల సేపు నీళ్ళలో నానబెట్టి ముద్దలా చేయాలి. జీడిపప్పుని కూడా ముద్దలా చేయాలి.  Step 5 ఇప్పుడు ఒక మందపాటి బాణలిలో నెయ్యి వేసి, క్యారెట్‌ తురుము వేసి వేయించుకోవాలి.  Step 6 తర్వాత బాదం పాలు పోసి యాలకులు వేసి పాలన్నీ ఆవిరైపోయేవరకూ అరగంట సేపు చిన్న మంటపై ఉడకనివ్వాలి.  Step 7 ఇప్పుడు ఖర్జూరం ముద్ద వేసి బాగా కలుపుకోవాలి. జీడిపప్పు ముద్ద కూడా వేసి మరోసారి కలుపుకోవాలి.  Step 8 ఈ మిశ్రమాన్ని గట్టిపడేవరకూ ఉడికించాలి. తర్వాత నెయ్యి రాసిన ప్లేట్‌లో ఈ మిశ్రమాన్ని వేసి పరచినట్లు చేయాలి.  Step 9 దీనిపై కిస్‌మిస్‌, బాదం, జీడిపప్పు తరుగు వేసి ఆరిన తర్వాత నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్‌ చేసుకుంటే గాజర్‌ బర్ఫీ రెడీ!  
Yummy Food Recipes
Add
Recipe of the Day