mutton paya recipe By , 2017-06-17 mutton paya recipe Here is the process for mutton paya making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 35min Ingredients: మేక/ పొట్టేలు కాళ్లు - 4,,ఉల్లిపాయ - 1,,టమోటాలు - 3,,అల్లం వెల్లుల్లి పేస్టు - 2 టేబుల్‌ స్పూన్లు,,దనియాల పొడి - 1 టీ స్పూను,,కారం - 1 టీ స్పూను,,పసుపు - పావు టీ స్పూను,,నూనె - 2 టేబుల్‌ స్పూన్లు,,కొత్తిమీర - 1 కట్ట,,లవంగాలు - 2,,దాల్చినచెక్క - అంగుళం ముక్క,,బిర్యాని ఆకు - 1,,సోంపు - 2 టీ స్పూన్లు,,కొబ్బరి పాలు - పావు కప్పు., Instructions: Step 1 శుభ్రం చేసిన మేక కాళ్లను రెండు అంగుళాల ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి.  Step 2 కుక్కర్లో ఉల్లితరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా ముక్కలు, దనియాల పొడి, పసుపు, ఉప్పు, కారం ఒకటి తర్వాత ఒకటి వేగించాలి.  Step 3 ఇప్పుడు మటన్‌ ముక్కలతో పాటు 4 కప్పుల నీరు పోసి, కొత్తిమీర తరుగు కూడా వేసి 8 నుండి 10 విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి.  Step 4 కుక్కర్‌ మూత తియ్యకుండా ఒక రాత్రంతా పక్కనుంచాలి. లేదా కనీసం 5 గంటలైనా ఉంచాలి. (ఇలా చెయ్యటం వలన ఎముకల రసం కర్రీలోకి దిగుతుంది). మర్నాడు పాయాను వేడి చేసి కొబ్బరి పాలు కలపాలి.    Step 5 చివరగా కొద్ది నూనెలో వేగించిన లవంగాలు, బిర్యాని ఆకు, దాల్చినచెక్క, సోంపును పాయాలో కలిపి దించెయ్యాలి.    Step 6 ఇది బ్రెడ్‌, చపాతి, ఇడ్లీ, దోశ దేనితో తిన్నా ఎంతో రుచిగా ఉంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day