Noor mahal pulao recipe By , 2017-06-06 Noor mahal pulao recipe Here is the process for Noor mahal pulao making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బాస్మతి బియ్యం - 2 కప్పులు,ఉల్లితరుగు - పావుకప్పు,కుంకుమపువ్వు - కొద్దిగా,చీజ్ - అరకప్పు,లవంగాలు - 6,క్రీమ్ - 3 స్పూన్లు,వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు,ఉప్పు - తగినంత,దాల్చినచెక్క - చిన్న ముక్క,జీలకర్ర - టీ స్పూను,ఏలకులు - 8,పాలకూర రసం - 2 టేబుల్ స్పూన్లు,బటర్ - 2 టేబుల్ స్పూన్లు,కొత్తిమీరతరుగు - 2 టేబుల్ స్పూన్లు,గరంమసాలా - టీ స్పూను,నూనె - 4 టేబుల్ స్పూన్లు,బిరియానీ ఆకు - 1, Instructions: Step 1 ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంటసేపు నానబెట్టాలి. తరువాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టి అందులో నూనె వేసి కాగాక బిరియానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, ఏలకులు వేసి సన్నని మంట మీద వేయించాలి.  Step 2 ఇప్పుడు  అల్లం వెల్లుల్లి పేస్ట్ , గరంమసాలా వేసి కొద్దిగా వేయించాలి. తరువాత  నానబెట్టుకున్న బియ్యం వేసి నాలుగైదు నిముషాలు కలిపి, అందులో సరిపడా నీళ్ళు, ఉప్పు వేసి సన్ననిమంట మీద ఉడికించాలి.  Step 3 ఇప్పుడు ఒక చిన్న బౌల్‌తీసుకుని అందులో చీజ్‌ తురుము, క్రీమ్, ఉప్పు వేసి కలపాలి. దీనిని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని పాలు, కుంకుమపువ్వు ఉన్న బౌల్‌లో వేయాలి.  Step 4 ఒక భాగం పాలకూర రసంలో వేయాలి. మూడవ భాగాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి నూనెలో వేయించాలి( వీటినే నూర్ మహల్ అంటారు).    Step 5 తరువాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని చీజ్ బాల్స్ వేసి అందులోనే  ఉడికిన రైస్, కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.          
Yummy Food Recipes
Add