Gummadikaya Masala By , 2017-11-10 Gummadikaya Masala Here is the process for Gummadikaya Masala making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: గుమ్మడికాయ ముక్కలు : ఒకటన్నర కప్పు,ఉల్లిపాయ ముక్కలు : అరకప్పు,పాలు : అరకప్పు,పచ్చిమిర్చి : 2,అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1 చెంచా,గరం మసాలా : 1 చెంచా,జీలకర్ర : అరచెంచా,ఆవాలు : అరచెంచా,కారం : అరచెంచా,పసుపు : చిటికెడు,ఉప్పు : తగినంత,నూనె : సరిపడా,కరివేపాకు : 1 రెమ్మ, Instructions: Step 1 స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. వేడెక్కాక కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేయాలి. Step 2 చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి, ఉప్పు చల్లాలి. వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకూ వేయించాలి. * తరువాత గుమ్మడికాయ ముక్కలు వేసి, పసుపు చల్లి మూత పెట్టాలి.  Step 3 ఓ అయిదు నిమిషాల పాటు మగ్గిన తరువాత పాలు పోసి కలిపి మళ్లీ మూత పెట్టేయాలి.  Step 4 గుమ్మడికాయ ముక్క మెత్తబడిన తరువాత కారం, గరం మసాలా పొడి వేసి మళ్లీ మూత పెట్టేయాలి.    Step 5 పాలు ఇగిరిపోయేవరకూ ఉడికించి దించేసుకోవాలి. ఇది అన్నంలోకే కాకుండా చపాతీ, రోటీల్లోకి కూడా బాగుంటుంది.                   
Yummy Food Recipes
Add
Recipe of the Day