Raj Bhog recipe By , 2017-06-03 Raj Bhog recipe Here is the process for Raj Bhog making .Just follow this simple tips Prep Time: 35min Cook time: Ingredients: చిక్కని పాలు - 1 లీ,పంచదార - 750 గ్రా,యాలకుల పొడి - 1 స్పూన్,రోజ్ వాటర్ - 1 స్పూన్,నిమ్మరసం - 2 స్పూన్స్,ఫుడ్ కలర్ - 1/4 స్పూన్,నీళ్ళు - 3 కప్పులు,బాదం, పిస్తా పప్పులు - 2 స్పూన్స్, Instructions: Step 1 బాణలిలో 2 కప్పుల పాలు, 2 స్పూన్స్ పంచదార వేసి సగానికి సగం వచ్చే వరకు మరిగించాలి.  Step 2 ఇప్పుడు సన్నగా కట్ చేసిన బాదం, పిస్తా పప్పులు, యాలకుల పొడి వేసి మిశ్రమం గట్టి పడే వరకు ఉడికించి దించాలి. కొద్దిగా చల్లారిన తరువాత చిన్న ఉండలుగా చేసి ఉంచాలి.  Step 3 మరోక పాత్రలో మిగిలిన పాలు పోసి మరిగించాలి. మరగడం మెదలు కాగానే ఫుడ్ కలర్, నిమ్మరసం పోయాలి.  Step 4 పాలు విరిగిపోగానే దించి పలుచని బట్టలో వేసి నీళ్ళన్నీ పోయేలా బట్టను మెలి తిప్పాలి.    Step 5 తరువాత బట్టలో ఉన్న పాల విరుగుడును పది బాగాలుగా చేయాలి. ఒక్కో దాన్నీ ముందు చదరంగా వత్తి అందులో ఇందాక తాయారు చేసిన ఉండాలని పెట్టి మూసేసి మళ్లీ దాన్ని ఉండలుగా చేయాలి.    Step 6 విడిగా మరో బాణలిలో పంచదార వేసి, సరిపడ నీళ్ళు పోసి పంచదార కరిగేవరకూ మరిగించాలి. ఇప్పుడు తాయారు చేసిన ఉండాలని పంచదార మిశ్రమంలో వేసి 15 నిముషాలు మరిగించి దించాలి.    Step 7 చివరగా అందులో రోజ్ వాటర్ కలిపి కాసేపు ఫ్రిజ్ లో పెట్టి చల్లగా వడ్డించాలి. అంతే రుచికరమైన రాజ్ భోగ్ తయార్.          
Yummy Food Recipes
Add