Ghee Chalimidi recipe By , 2017-06-03 Ghee Chalimidi recipe Here is the process for Ghee Chalimidi making .Just follow this simple tips Prep Time: Cook time: Ingredients: శ్రీరామనవమి స్పెషల్ వంటకము,బియ్యం - 1/2 కేజీ,నెయ్యి - 50 గ్రా,బెల్లం - 350 గ్రా,గసగసాలు - 2 స్పూన్స్,యాలకుల పొడి - 1/2 స్పూన్,ఎండు కొబ్బరి పొడి - 1/4 కప్పు,వేయించిన పల్లీలు - కొద్దిగ,జీడిపప్పు, ద్రాక్ష - కొన్ని, Instructions: Step 1 బియ్యాన్ని శుభ్రంగా కడిగి, నీళ్ళలో ఒక రాత్రి మొత్తం నానపెట్టాలి. తరువాత ఆ బియ్యాన్ని కాసేపు నీడలో ఆరబెట్టి, గ్రైండర్‌లో వేసి మెత్తగా పిండి చేసి జల్లెడ పట్టి పక్కన పెట్టుకోవాలి.  Step 2 ఇప్పుడు ఒక గిన్నెలో తగినన్ని నీళ్ళు పోసి బెల్లాన్నిపాకం పట్టాలి. తీగ పాకం వచ్చిన తరువాత దించి అందులో కొద్ది కొద్దిగా పిండిని పోస్తూ బాగా కలియబెడుతూ పాకంలో పిండి బాగా కలిసేలా కలుపుతూ ఉండాలి.  Step 3 పిండి అంతా బాగా కలిసిన తరువాత అందులో నెయ్యి యాలకుల పొడి, కొబ్బరి పొడి, గసగసాలు, వేయించిన జీడిపప్పు, ద్రాక్ష, పల్లీలు వేసి మరోసారి బాగా కలపాలి. Step 4 ఈ పిండి కొద్దిగా చల్లారిన తరువాత లడ్డు లాగా చేసుకుని ఆరిన తరువాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. అంతే నేతి చలిమిడి రెడీ.                          
Yummy Food Recipes
Add
Recipe of the Day